వెస్టిండీస్‌తో తొలి టి20 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. వన్డే సిరీస్‌లో మెప్పించిన సంజూ శాంసన్ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోవిడ్-19తో దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సంజూ శాంసన్ మెయిడెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు.
ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఐర్లాండ్‌లో పర్యటించిన టీమిండియా.. రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. కాగా ఐర్లాండ్‌తో మొదటి టి20లో సంజూ శాంసన్ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయడం జట్టు బెంచ్ బలాన్ని మరింత పటిష్టపరిచింది. అయితే తుది జట్టులో అతనికి చోటు దక్కడం కష్టమే. ఎందుకంటే టి20 సిరీస్‌కు రోహిత్, పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యాలు తిరిగి రావడం సంజూకు మైనస్ అనే చెప్పొచ్చు.
ఇక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న జోరులో ఉన్న భారత జట్టు టి20 సిరీస్‌పై కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్‌లో విండీస్‌తో టీమిండియా తలపడుతుంది. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఇక్కడ బరిలోకి దిగుతుండటంతో భారత్ బలం మరింత పెరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ చానెల్లో, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ , ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.
Sanju Samson has been added to India's T20i squad against West Indies.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2022
చదవండి: భారత్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన... బంగ్లాను ఓడించిన అదే టీమ్‌తో!
India Probable XI: ఓపెనర్‌గా పంత్.. అశ్విన్‌కు నో ఛాన్స్! కుల్దీప్ వైపే మొగ్గు!
Comments
Please login to add a commentAdd a comment