2011 వన్డే వరల్డ్‌కప్ ఎవరు గెలిచారు అని అడగ్గానే టక్కున వచ్చే సమాధానం టీమిండియా. ఎంఎస్ ధోని సారధ్యంలోని టీమిండియా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. కాగా ఐర్లాండ్ విజయాన్ని టీమిండియా అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
మరి టీమిండియా అభిమానుల సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలేంటి అనేది విశ్లేషిస్తే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. 328 పరుగుల భారీ టార్గెట్‌ని పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించి... టాప్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతిలోనే పరాజయం ఎదురైంది ఇంగ్లండ్‌కు. ఇక అప్పటి వరల్డ్‌కప్‌ను టీమిండియా నెగ్గిన సంగతి తెలిసిందే.
అలా చూసుకుంటే మళ్లీ 11 ఏళ్లకు ఇంగ్లండ్‌ను ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో ఈసారి టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవబోతుందనే సెంటిమెంట్ నిజమయ్యే అవకాశాలున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సిల్లీ లాజిక్‌లు పట్టించుకుంటే అంతేనంటూ కొంతమంది కొట్టిపారేయగా.. మరి కొంతమంది మాత్రం..''నమ్మలేం కానీ నిజమైతే బాగుండు'' అంటూ పేర్కొన్నారు.
ఇంతకముందు 2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యిందని.. అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని ఎంఎస్ ధోనీ చెప్పిన 'బిస్కెట్' లాజిక్‌తో పోలిస్తే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సెంటిమెంట్ చాలా బెటర్‌గా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ పేర్కొనడం గమనార్హం. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశలో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. గురువారం సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
చదవండి: కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు!
న్యూజిలాండ్‌కు ఊహించని షాక్.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ రద్దు
It's time to revisit Ireland victory against England in 2011.pic.twitter.com/rd8zU9ZUy3
— Cricket Videos🏏 (@Crickket__Video) October 26, 2022
Comments
Please login to add a commentAdd a comment