Indian cricket fans
-
2011లో ఇలాగే.. నమ్మలేం కానీ నిజమైతే బాగుండు!
2011 వన్డే వరల్డ్‌కప్ ఎవరు గెలిచారు అని అడగ్గానే టక్కున వచ్చే సమాధానం టీమిండియా. ఎంఎస్ ధోని సారధ్యంలోని టీమిండియా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. కాగా ఐర్లాండ్ విజయాన్ని టీమిండియా అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి టీమిండియా అభిమానుల సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలేంటి అనేది విశ్లేషిస్తే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, ఐర్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. 328 పరుగుల భారీ టార్గెట్‌ని పసికూన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో ఛేదించి... టాప్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇది జరిగిన 11 ఏళ్లకు మళ్లీ ఐర్లాండ్ చేతిలోనే పరాజయం ఎదురైంది ఇంగ్లండ్‌కు. ఇక అప్పటి వరల్డ్‌కప్‌ను టీమిండియా నెగ్గిన సంగతి తెలిసిందే. అలా చూసుకుంటే మళ్లీ 11 ఏళ్లకు ఇంగ్లండ్‌ను ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో ఈసారి టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవబోతుందనే సెంటిమెంట్ నిజమయ్యే అవకాశాలున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. అయితే ఇలాంటి సిల్లీ లాజిక్‌లు పట్టించుకుంటే అంతేనంటూ కొంతమంది కొట్టిపారేయగా.. మరి కొంతమంది మాత్రం..''నమ్మలేం కానీ నిజమైతే బాగుండు'' అంటూ పేర్కొన్నారు. ఇంతకముందు 2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యిందని.. అప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని ఎంఎస్ ధోనీ చెప్పిన 'బిస్కెట్' లాజిక్‌తో పోలిస్తే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సెంటిమెంట్ చాలా బెటర్‌గా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ పేర్కొనడం గమనార్హం. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశలో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. గురువారం సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. చదవండి: కంగ్రాట్స్ ఐర్లాండ్.. ఇంగ్లండ్ అలా అనకుంటే చాలు! న్యూజిలాండ్‌కు ఊహించని షాక్.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ రద్దు It's time to revisit Ireland victory against England in 2011.pic.twitter.com/rd8zU9ZUy3 — Cricket Videos🏏 (@Crickket__Video) October 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డుప్లెసిస్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల ఫైర్
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్పై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికాను మట్టి కరిపించిన టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమోదు చేసిన మన ఆటగాళ్లు ప్రత్యర్థికి చెమటలు పట్టించారు. వారికి తోడు బౌలర్లు తలోచేయి వేయడంతో సఫారీ జట్టు ఏ మ్యాచ్‌లోనూ తేరుకోలేకపోయింది. అయితే, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను కించపరుస్తూ డుప్లెసిస్ వ్యాఖ్యలు చేశాడు. టాస్ కలిసిరావడం వల్లే భారత బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయగలిగారని.. వరుసగా టాస్ ఓడిపోవడం మా కొంపముంచిందని అన్నాడు. అంతటితో ఆగకుండా.. ప్రతిమ్యాచ్ కాపీ, పేస్ట్‌లా సాగిందని చులకనగా మాట్లాడాడు. (చదవండి : అసలు మీరు ఆడితేనే కదా?: స్మిత్ చురకలు) ‘ప్రతి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచేది. తొలుత బ్యాటింగ్ చేపట్టి 500 పైచిలుకు పరుగులు సాధించేది. చీకటి పడుతుందగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేది. అదే చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. ప్రతి మ్యాచ్‌లో ఇదే తంతు. అంతా కాపీ, పేస్ట్‌లా సాగిపోయింది’అని ఓ స్పోర్ట్స్ చానెల్లో వ్యాఖ్యానించాడు. ఇక డుప్లెసిస్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్‌గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదని ఒకరు చురకలంటించారు. ‘డుప్లెసిస్ మాటలు చాలా కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అతన్ని బండబూతులు తిట్టాలనుంది. కానీ, సీఎస్కే ఆటగాడు కదా అని వదిలేస్తున్నా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘డుప్లెసిస్ చెప్పే సాకులు భయంకరంగా ఉన్నాయి. పోనీలే అతన్ని వదిలేద్దాం అనుకుంటే పొరబాటే. అతను మారడు. మళ్లీ అలానే చేస్తాడు. అందుకే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుందాం’ అని మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘చిన్నపిల్లల మనస్తత్వం. కాపీ పేస్ట్‌లా మ్యాచ్‌లు సాగాయట. అతని మాటలు విని పగలబడి నవ్వుకున్నా’అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. -
మాజీ క్రికెటర్‌పై ఇండియన్ ఫ్యాన్స్ గరం
సాక్షి, స్పోర్ట్స్: శ్రీలంక సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై ఇండియన్స్ గరంగరంగా ఉన్నారు. అసంబద్ధ వ్యాఖ్యల నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ పై ట్విట్టర్లో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆగష్టు 27న పల్లెకల్లె మూడో వన్డే సందర్భంగా లంక ఓటమిని తట్టుకోలేక శ్రీలంక ఫ్యాన్స్ బాటిళ్లను మైదానంలోకి విసిరి రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరగంట సేపు ఆటను నిలిపివేసి అనంతరం తిరిగి ప్రారంభించగా, భారత్ విక్టరీ సాధించింది. అయితే వరసగా ఓటమి పాలవుతున్న తమ జట్టును చూసి మండిపడుతున్న శ్రీలంక ఫ్యాన్స్ ను అర్జున రణతుంగ ఊరడించే క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈడెన్ గార్డెన్ లో 1996లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాన్ని ఉటంకిస్తూ అభిమానులతో రణతుంగ... ‘మీకు నా విన్నపం ఒక్కటే. క్రికెట్ చరిత్రలో మనకంటూ ఓ చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. దయచేసి భారత క్రికెట్ అభిమానుల్లాగా మాత్రం ప్రవర్తించకండి. ఇలాంటి ప్రవర్తనతో లంక టీం పరువు తీయకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో రణతుంగా వార్ ప్రకటించిన ఇండియన్ క్రికెట్ లవర్స్ ట్వీట్లతో రణతుంగపై విరుచుకుపడుతున్నారు. Think before you speak. Indian spectators are matured than srilankans @ArjunaRanatunga — harikrishnaa (@harikrishnaa114) 30 August 2017 @ArjunaRanatunga A man who just have 4 test hundreds in his name (just equal to what our Aswin a batsman Cum bowler has in his name) — Ajay Sharma (@ajay_saraswat18) 30 August 2017 -
చిత్తుగా ఓడినా టీమిండియానే గ్రేట్!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ తమ జట్టు విజయం కోసం పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోహ్లి సేన విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఊహించిన దానికి భిన్నంగా మ్యాచ్ ఏకపక్షంగా జరగడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత మంది క్రీడాస్ఫూర్తి కనబరిచారు. ఆటలో గెలుపోటముల సహజమని, బాగా ఆడిన జట్టే గెలిచిందని పేర్కొన్నారు. అనూహ్యంగా పుంజుకుని విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు అభినందనలు తెలిపారు. చివరి మెట్టుపై బోల్తా పడిన కోహ్లి సేనకు బాసటగా నిలిచారు. గెలిచినా, ఓడినా టీమిండియాను అభిమానిస్తూనే ఉంటామన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంతమాత్రానా ద్వేషించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. ప్రతిసారి మనమే గెలవడం సాధ్యంకాదని, ఇప్పటికీ గొప్ప జట్టు టీమిండియానే అని పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా ఎదురు నిలిచి పోరాడాడని ప్రశంసించారు. కోహ్లి క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు రిషికపూర్, అభిషేక్ బచ్చన్, రణవీర్ సింగ్, సిద్ధార్థ మల్హోత్ర, అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్, ఫర్హాన్ అక్తర్, సుస్మిత సేన్, దియా మిర్జా, సోహ అలీఖాన్, విశాల్ తదితరులు కూడా ఇండియా టీమ్‌కు మద్దతుగా ట్వీట్లు పెట్టారు. Yes Pakistan, you have defeated us. Well played, outplayed us in all departments. Many congratulations, I concede. Best wishes! — Rishi Kapoor (@chintskap) June 18, 2017 Win some, lose some..still the greatest team in the world! ✊ -
టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం
న్యూఢిల్లీ: టీవీలు పగిలాయి.. పోస్టర్లు దగ్థమయ్యాయి.. నినాదాలు హోరెత్తాయి... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత భారత క్రికెట్ అభిమానుల రియాక్షన్ ఇది. దాయాదుల సమరంలో పోరాడకుండానే కోహ్లి సేన సులువుగా లొంగిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్ తమ కోపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి కోహ్లి సేనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అహ్మదాబాద్‌లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్పూర్‌లో కెప్టెన్ కోహ్లి, అశ్విన్, యువరాజ్ సింగ్, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాళ్లదాడి, అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రాంచిలోని మహేంద్ర సింగ్ ధోని ఇంటి వద్ద భద్రతను పెంచారు. మిగతా ఆటగాళ్ల నివాసాల దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. -
...తలా పిడికెడు!
ఆట ఏదైనా గెలుపోటములు సహజం. ఆడేవాళ్లయినా, చూసేవాళ్లయినా ఆటను ఆస్వాదించాలి. ప్రత్యర్థులు బాగా ఆడితే అభినందించాలి. కానీ దక్షిణాఫ్రికాతో రెండో టి20 సందర్భంగా కటక్‌లో ప్రేక్షకులు విజ్ఞత మరచిపోయారు. భారత జట్టు పేలవ ఆటతీరుకు నిరసనగా మైదానంలోకి బాటిళ్లు విసిరి పరువు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న సిరీస్ కావడం వల్ల ఈ సంఘటనపై చాలా ఎక్కువగానే చర్చ జరిగింది. వాస్తవానికి మనం ఈ సిరీస్‌ను గాంధీ మహాత్ముడి పేరుతో నిర్వహిస్తున్నాం. అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్ఫూర్తి ప్రదాత పేరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. మైదానంలో ప్రేక్షకులు బాటిళ్లు విసరడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1996 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులు చేసిన గొడవ ఇప్పటికీ ప్రతి ప్రపంచకప్ సమయంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అడపాదడపా జరుగుతూనే ఉన్నా... భారత ఉపఖండంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్... నాలుగు దేశాల్లోనూ క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తుంటారు. అందుకే గెలిస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఓడినప్పుడు ఇళ్లపై రాళ్లు వేస్తుంటారు. పలు సందర్భాల్లో ఇలా జరిగినా ఈసారి శాంతి దూతలు గాంధీ-మండేలా సిరీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. బాటిళ్లు విసిరిన వారిలో ఈ సిరీస్‌కు ఉన్న పేరు, ప్రాముఖ్యత గురించి ఆలోచించే విజ్ఞత లేకపోయింది. దీనిపై క్రికెట్ ప్రపంచం అంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు మాజీ క్రికెటర్లు ప్రేక్షకుల ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. గవాస్కర్ అయితే రెండేళ్ల పాటు కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒడిశా క్రికెట్ సంఘానికి నిధులూ ఆపేయాలని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా లైట్‌గా తీసుకుంది ధోని ఒక్కడే. ‘ప్రేక్షకులు కోపంతో బాటిళ్లు విసరరు. మొదట ఒకటి నుంచి పది బాటిళ్లు మాత్రమే కోపంతో వేస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు సరదా కోసం వీరిని అనుసరిస్తారు. గతంలో మేం ఓ మ్యాచ్‌లో తొందరగా గెలిచినప్పుడూ ఇలా బాటిళ్లు విసిరారు. కాబట్టి ఇలాంటి సంఘటనకు ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో మాత్రం రాజీ పడకూడదు’ అని ధోని చెప్పాడు.నిజానికి ప్రేక్షకులు ఇలా ప్రవర్తించడాన్ని ఇంకో కోణంలోనూ చూడాలి. మన దగ్గర క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడటం ఓ ప్రహసనం. ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందంటే టిక్కెట్ కొనడం దగ్గరి నుంచి మ్యాచ్ చూసి ఇంటికి రావడం వరకూ అడుగడుగునా ప్రతిదీ ఓ గండమే. టిక్కెట్ కోసం లైన్లలో గంటలకొద్దీ నిలబడాలి. తొక్కిసలాట జరగొచ్చు... లాఠీలు విరగొచ్చు... అయినా అభిమానం చెక్కుచెదరదు. ఇక ఏడు గంటలకు మ్యాచ్ అంటే ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఐదు గంటల ముందే బయల్దేరాలి. మూడు గంటల పాటు లైన్లలో నిలుచోవాలి. పలుచోట్ల తనిఖీలు. సెల్‌ఫోన్ తెచ్చినందుకు వెనక్కు వెళ్లిన ప్రేక్షకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక కొద్దిగా జనం పెరిగారంటే అక్కడా లాఠీచార్జిలు. నిజంగా క్రికెట్ చూడటానికి ఇంత కష్టపడాలా? ఇంత కష్టపడి మైదానంలోకి వచ్చి గొంతు చించుకుని అరుస్తూ తమ హీరోలను ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తే... మైదానంలో దోపిడి. నీళ్ల దగ్గరి నుంచి ఆహారం వరకు ప్రతీదీ దోపిడియే. అయినా అభిమానం చెక్కు చెదరదు. తీరా ఎంతో ఆశించి వస్తే కనీసం పోరాడకుండా తమ జట్టు చేతులెత్తేస్తే ఆక్రోశం రాక మానదు. అయితే దీనిని అధిగమించే విజ్ఞత అందరిలోనూ ఉండదు. ప్రేక్షకుల ప్రవర్తననూ ఎవరూ సమర్ధించాల్సిన పని లేదు. కానీ ఇలాంటి సంఘటనలు పదే పదే ఎందుకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి. ఆటను ఆస్వాదించే వాతావరణం స్టేడియాల్లో ఉంటోందా? ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కుటుంబాలతో కలిసి వెళ్లి సరదాగా మ్యాచ్ చూస్తూ ఓ పిక్నిక్ తరహాలో ఎంజాయ్ చేస్తారు. ప్రత్యర్థి బాగా ఆడినా అభినందిస్తారు. అందుకే ప్రేక్షకుల ముందు కంచెలు ఉండవు. నిజానికి అలాంటి వాతావరణం మన దగ్గర కల్పించలేకపోతున్నాం. క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితిని ముందు మార్చాలి. తప్పు ప్రేక్షకుల వైపు నుంచే కాదు... అన్ని వైపుల నుంచీ ఉంది. మ్యాచ్‌ల నిర్వహణ సరిగా చేయలేని బోర్డుల దగ్గరి నుంచి... మైదానంలో నిలబడి ప్రేక్షకులను గమనించకుండా క్రికెట్ చూసే పోలీసుల వరకు... అందరిదీ తప్పే. - సాక్షి క్రీడా విభాగం -
తిట్టడం కరెక్ట్ కాదేమో!
ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోవడం వల్ల ప్రపంచమేమీ అంతమైపోదు. ఎవరి జీవితాలూ మారిపోవు. కాకపోతే ‘అవసరమైతే ఉద్యోగమైనా మానేస్తాగానీ... ఆఫీస్‌కు రాను’ అని బాస్‌కి చెప్పి టీవీకి అతుక్కుపోయిన అభిమానుల పరిస్థితే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆఫీస్‌కు వెళ్లి ఏం చెప్పాలి? వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచిన జట్టును ఒక్క మ్యాచ్ ఓడిపోగానే తిట్టడం కరెక్ట్ కాదేమో! ఇంత పెద్ద టోర్నీలో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోవడం సహజం. అయితే అది లీగ్ దశలో ఏ వెస్టిండీస్ చేతిలోనో ఓడితే బాగుండేది. నెల రోజులకు పైగా మీ జోరును, మీ ఉత్సాహాన్ని చూసి ఇక కప్ మనదేనన్న ధీమాతో ఉన్న మాకు ఇదో పెద్ద షాక్. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా... ఆ పోరాటం మా మనసుల్ని దోచింది. కానీ మీరు ఆడిన తీరే నిరాశపరిచింది. పిచ్చి మ్యాచ్‌లన్నీ అద్భుతంగా గెలిచి, అసలైన మ్యాచ్కొచ్చేసరికి కనీసం పోరాడలేకపోయారు. బయటకు చెప్పుకోలేని వేదన. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 300 చేయడం ఊహించలేని విషయమేం కాదు. ఒక దశలో 400 కూడా బాదుతారేమో అని భయమేసినా... పాపం బౌలర్లు ఎలాగోలా కష్టపడి దూకుడును ఆపారు. చివర్లో ఆ 20 అదనంగా రాకుండా ఉంటే బాగుండేది. సరే... 329 పరుగులు ఛేజ్ చేయడం చాలా కష్టం. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో ఛేజ్ చేయడం అంటే అద్భుతమే. అయితే మన బ్యాటింగ్ బలం జగద్విదితం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగా ఆడిన తర్వాత ధావన్ కాస్త తొందరపడ్డాడు. కానీ ఆ కోహ్లికి ఏమైంది. ఏదో పని ఉన్నట్లు ఐదు నిమిషాల్లో వెనక్కి వెళ్లాల్సిన అవసరమేముంది. ఇక రోహిత్ కూడా తన వంతు పాత్ర పూర్తిగా పోషించలేకపోయాడు. సురేశ్ రైనా షార్ట్‌పిచ్ బలహీనత ప్రపంచానికి తెలిసిందే. ఈ టోర్నీలో తన బలహీనతను అధిగమించాడనుకుంటే... మళ్లీ అదే షార్ట్ బంతికి బలయ్యాడు. అక్కడితోనే ఓటమికి మానసికంగా సిద్ధమయ్యాం. అయినా ధోని ఉన్నాడని ఓ ఆశ. ఆ ఆశతోనే చివరి వరకూ టీవీ కట్టేయలేకపోయాం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు. మహామహులంతా పెవిలియన్‌లో కూర్చున్నాక... కొండంత లక్ష్యాన్ని క ళ్ల ముందుంచుకుని ఏం పోరాడతాడు. తను అవుట్ కావడంతోనే అంతా అయిపోయింది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు ధోనికి కూతురు పుట్టింది. ఇప్పటివరకూ తను కనీసం కూతురి స్పర్శను ఆస్వాదించలేదు. కావాలంటే భార్య, కూతురిని ఆస్ట్రేలియా పిలిపించుకోలేడా? కానీ ఒక పెద్ద టోర్నీ మధ్యలో ఆట తప్ప మిగతా విషయాల మీదకు దృష్టి పోకూడదు. మరి కోహ్లికి ఏం తొందరొచ్చిందనో అనుష్క శర్మను పిలిపించుకున్నాడు. అక్కడికీ మ్యాచ్ మధ్యలో వస్తున్న యాడ్‌లో బామ్మ చెబుతూనే ఉంది. ‘నువ్వు ఆట మీద దృష్టిపెట్టు. షూటింగ్‌లు ఎందుకు’ అని. అయినా కోహ్లి చెవులకు అది ఎక్కలేదు. వెనక్కు ఇవ్వొద్దు (వోంట్ గివ్ ఇట్ బ్యాక్) అంటూ కోట్లాది మంది గొంతెత్తి అరుస్తున్నా... లక్షలాది మంది పనులు మానుకుని ప్రార్థనలు చేస్తున్నా.... మీరు ఓ మ్యాచ్ ముందే కప్‌ను ఇచ్చేశారు. ఓ వైపు కోపం వస్తోంది, మరోవైపు బాధేస్తోంది. కానీ ఏం చేయగలం. మహా అయితే మాలో మేం నాలుగు తిట్లు తిట్టుకుంటాం. కానీ క్రికెట్‌ను చూడటం అయితే ఆపలేం కదా. ఓ పది రోజులు ఆగితే మళ్లీ ఐపీఎల్ వస్తుంది. ఇప్పుడు ఎంత తిట్టుకున్నా... మళ్లీ ఆ సమయానికి ఆటోమేటిక్‌గా చేయి టీవీ రిమోట్ అందుకుంటుంది. -బాధతో ఓ భారత అభిమాని