చిత్తుగా ఓడినా టీమిండియానే గ్రేట్!
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ తమ జట్టు విజయం కోసం పూజలు, హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోహ్లి సేన విజయాన్ని కాంక్షిస్తూ మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఊహించిన దానికి భిన్నంగా మ్యాచ్ ఏకపక్షంగా జరగడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీంతో చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత మంది క్రీడాస్ఫూర్తి కనబరిచారు.
ఆటలో గెలుపోటముల సహజమని, బాగా ఆడిన జట్టే గెలిచిందని పేర్కొన్నారు. అనూహ్యంగా పుంజుకుని విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు అభినందనలు తెలిపారు. చివరి మెట్టుపై బోల్తా పడిన కోహ్లి సేనకు బాసటగా నిలిచారు. గెలిచినా, ఓడినా టీమిండియాను అభిమానిస్తూనే ఉంటామన్నారు. ఒక్క మ్యాచ్ ఓడినంతమాత్రానా ద్వేషించాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు.
ప్రతిసారి మనమే గెలవడం సాధ్యంకాదని, ఇప్పటికీ గొప్ప జట్టు టీమిండియానే అని పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యా ఎదురు నిలిచి పోరాడాడని ప్రశంసించారు. కోహ్లి క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు రిషికపూర్, అభిషేక్ బచ్చన్, రణవీర్ సింగ్, సిద్ధార్థ మల్హోత్ర, అర్జున్ రాంపాల్, వరుణ్ ధావన్, ఫర్హాన్ అక్తర్, సుస్మిత సేన్, దియా మిర్జా, సోహ అలీఖాన్, విశాల్ తదితరులు కూడా ఇండియా టీమ్‌కు మద్దతుగా ట్వీట్లు పెట్టారు.
Yes Pakistan, you have defeated us. Well played, outplayed us in all departments. Many congratulations, I concede. Best wishes!
— Rishi Kapoor (@chintskap) June 18, 2017
Win some, lose some..still the greatest team in the world! ✊