ఈ ఏడాది జూన్‌లో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు రానుంది. ఈ పర్యటనను బీసీసీఐ దృవీకరించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్-2022 ముగిశాక భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభం కానుంది. భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ జూన్9న ప్రారంభమై 19 న ముగుస్తుంది. చెన్నై,కటక్, వైజాగ్,రాజ్‌కోట్, ఢిల్లీ వేదికలుగా ఈ సిరీస్ జరగనుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిరీస్‌కు వేదికలను నిర్ధారించినట్లు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కూడా పేర్కొంది. ఇరు జట్ల మధ్య ఈ పరిమిత ఓవర్ల సిరీస్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టిపి)లో భాగమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
మార్చి 26 నుంచి మే 29 వరకు ముంబై, పూణేలలో ఐపీఎల్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన 10 రోజుల తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టిపి)లో భాగం అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. ఇక తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో వన్డే, టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాభావం పొందిన సంగతి తెలిసిందే. అయితే స్వదేశంలో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ పర్యటన ముగిశాక టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. గత ఏడాది సిరీస్‌లో మిగిలిన టెస్టును భారత్ ఆడనుంది.
చదవండి: పాకిస్తాన్‌తో భారత్ తొలి మ్యాచ్.. మీరు సిద్దంగా ఉండండి: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment