మాస్టర్ ప్లాన్‌ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్‌! | India Master-Plan-Pant Stumped Sooriyabandara Fraction-Of-Seconds-Viral | Sakshi
Sakshi News home page

మాస్టర్ ప్లాన్‌ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్‌!

Aug 26 2026 6:46 PM | Updated on Aug 26 2026 9:03 PM

India Master-Plan-Pant Stumped Sooriyabandara Fraction-Of-Seconds-Viral

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. 

సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 

21 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్‌ప్లాన్ వేసింది.

ఆ మాస్టర్‌ప్లాన్‌లో పంత్‌, మానవ్ సుతార్‌లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్‌ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. 

ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్‌ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్‌లో  రికార్డయ్యాయి.

Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్‌.. ఏం జరిగిదంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement