అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం! | WTC-Final Scenario-Explained-Unless-IND Vs SL-2nd Test-Ends Draw | Sakshi
Sakshi News home page

అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం!

Aug 26 2026 7:48 PM | Updated on Aug 26 2026 9:18 PM

WTC-Final Scenario-Explained-Unless-IND Vs SL-2nd Test-Ends Draw

Photo Credit: BCCI Twitter

కొలంబోలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేస‌రికి భార‌త్ ప‌టిష్ట‌మైన స్థితిలో నిలిచింది. వ‌ర్షంతో మ్యాచ్ ఆగిపోయే స‌మ‌యానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండ‌గా, ఆతిథ్య జ‌ట్టు కేవ‌లం 16 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యంలో కొన‌సాగుతోంది. గురువారం ఆట‌కు చివ‌రి రోజు కావ‌డంతో, భార‌త్ గెలుపు లాంచ‌న‌మే అయిన‌ప్ప‌టికీ, వ‌ర్షం ముప్పు కూడా పొంచి ఉంది. 

ఒక‌వేళ వ‌ర్షంతో ఐదో రోజు ఆట‌లో ఒక్క బంతి కూడా సాధ్య‌ప‌డ‌క‌పోతే అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది. మ‌రి మ్యాచ్ డ్రా అయితే టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేర‌డంలో భార‌త్‌కు ఎదుర‌య్యే అడ్డంకులు ఏంట‌నేవి ఒక‌సారి ప‌రిశీలిద్దాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో (PCT) ఐదవ స్థానంలో ఉంది. 

ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, శ్రీలంకపై గెలిస్తే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ డ్రా అయితే మాత్రం, భారత్ 51.52 శాతం పాయింట్ల తేడాతో ఐదవ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో భార‌త్‌కు మ‌రో ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. 

ఇప్పటివరకు ఆడిన 10 టెస్టుల్లో ఇప్పటికే నాలుగింటిలో ఓడిపోయిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు, ఇక నుంచి ప్ర‌తీ టెస్టు నాకౌట్ లాంటిదే. ఈ ఏడాది నవంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఆ త‌ర్వాత ఐపీఎల్ 2027 సీజ‌న్‌కు ముందు స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. 

అయితే డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ నెగ్గ‌డంతో, భార‌త్ తమ‌కు మిగిలిన 8 టెస్టుల్లో ఏడు గెల‌వాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌డు లంక‌తో రెండో టెస్టు వ‌ర్షం వ‌ల్ల డ్రా అయితే మాత్రం భార‌త్ కచ్చితంగా ఏడింటికి ఏడు టెస్టులు గెల‌వాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా డ‌బ్ల్యూటీసీ పాయింట్లు 68.52గా ఉండ‌డంతో పాటు ఫైన‌ల్ ఆడేందుకు చాన్స్ ఉంటుంది. అంతేకాదు భారత్‌కు రాబోయే ఏడు టెస్టుల్లో ఎలాంటి పెనాల్టీ పాయింట్లు ల‌భించ‌క‌పోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయన్న విష‌యం గుర్తుంచుకోవాలి.

చదవండి: మాస్టర్ ప్లాన్‌ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement