ఆసియాలో టాప్–8లో లేకపోయినా భారత పురుషుల, మహిళల ఫుట్‌బాల్ జట్లను ఆసియా క్రీడలకు పంపించాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో ఆయా జట్లలో ముగ్గురు మినహా మిగతా సభ్యులు అండర్–23 ఆటగాళ్లే ఉండాలి. సీనియర్ ఆటగాళ్ల హోదాలో కెప్టెన్ సునీల్ ఛెత్రి, గోల్‌కీపర్ గుర్‌ప్రీత్, డిఫెండర్ సందీప్ జింగాన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
మరోవైపు భారత మహిళల సాఫ్ట్‌బాల్, పురుషుల వాటర్‌పోలో, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్ 5్ఠ5 జట్లను ఆసియా క్రీడలకు పంపించకూడదని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment