India Tour of South Africa: CSA Announces Revised Schedule Check Details: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనల నేపథ్యంలో సందిగ్దంలో పడిన టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ నిమిత్తం భారత జట్టు సౌతాఫ్రికా వెళ్లనుంది. అయితే, ముందుగా నిర్ణయించినట్లుగా డిసెంబరు 17 నుంచి కాకుండా.. డిసెంబరు 26 నుంచి సిరీస్ ఆరంభం కానుంది. అదే విధంగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
కాగా టీమిండియా పర్యటన నేపథ్యంలో టెస్టు, వన్డే సిరీస్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. టీ20 సిరీస్‌ను కొత్త ఏడాదిలో నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు, రీషెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి సేన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికా- టీమిండియా సిరీస్- కొత్త షెడ్యూల్
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ 2021-23లో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌లు:
►డిసెంబరు 26-30: సూపర్‌స్పోర్ట్ పార్క్- సెంచూరియన్
►జనవరి 03-07: ఇంపీరియల్ వాండరర్స్- జొహన్నస్‌బర్గ్
►జనవరి 11-15: సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
వన్డే సిరీస్ షెడ్యూల్
►జనవరి 19: యూరోలక్స్ బోలాండ్ పార్క్- పర్ల్
►జనవరి 21: యూరోలక్స్ బోలాండ్ పార్క్- పర్ల్
►జనవరి 23: సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
చదవండి: India Tour Of South Africa- Rahul Dravid: కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు.. అయితే..
Comments
Please login to add a commentAdd a comment