India Vs England 3rd ODI Match Live Updates and Highlights in Telugu - Sakshi
Sakshi News home page

IND vs ENG 3rd ODI: టీమిండియా, ఇంగ్లండ్‌ మూడో వన్డే లైవ్‌ అప్‌డేట్స్‌

Published Sun, Jul 17 2022 3:05 PM | Last Updated on Mon, Jul 18 2022 12:27 AM

India Vs England 3rd ODI Match Live Updates And Highlights - Sakshi

మాంచెస్టర్‌ వన్డేలో భారత్‌ ఘన విజయం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని 42.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి చేధించింది. రిషబ్‌ పంత్‌ 112 పంతుల్లో 121 పరుగులు, రవీంద్ర జడేజా 15 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత విజయంలో రిషబ్‌ పంత్‌, హార్దిక్‌పాండ్యా కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌ విజయంతో టీమిండియా సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది.

రిషబ్‌ పంత్‌ సెంచరీ
మాంచెస్టర్‌ వన్డేలో టీమిండియా బ్యాట్‌మెన్‌ రిషబ్‌ పంత్‌ సెంచరీతో మెరిశాడు. 106 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో వన్డేల్లో తొలి శతకాన్ని పంత్‌ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే టీమిండియా 41.3 ఓవర్లలో 248 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. విజయానికి 51 బంతుల్లో 12 పరుగులు సాధించాల్సి ఉంది.

పంత్‌, పాండ్యా అర్థసెంచరీలు.. టీమిండియా స్కోరెంతంటే?
►ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యాలు అర్థసెంచరీతో మెరిశాడు. పాండ్యా 43 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించగా.. పంత్‌ 71 బంతుల్లో అర్థశతకం సాధించాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి 91 పరుగుల అవసరం ఉంది.

28 ఓవర్లలో టీమిండియా 141/4
►28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. పాండ్యా 47, పంత్‌ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న పాండ్యా, పంత్‌.. టీమిండియా స్కోరెంతంటే?
►23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 24, రిషబ్‌ పంత్‌ 32 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

సూర్య కుమార్‌ ఔట్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా తడబడుతుంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న టీమిండియా తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌(16 పరుగులు) ఓవర్టన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.

16 ఓవర్లలో టీమిండియా 71/3
►16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. సూర్యకుమార​ యాదవ్‌ 17, పంత్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా.. 38 పరుగులకే మూడు వికెట్లను చేజార్చుకుంది. మూడో వికెట్‌గా కోహ్లి(17) పెవిలియన్‌ చేరాడు. టోప్లే వేసిన 9 ఓవర్‌ తొలి బంతికి జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు కోహ్లి,  అంతకుముందు శిఖర్‌ ధావన్‌(1), రోహిత్‌ శర్మ(17)లు కూడా టోప్లే బౌలింగ్‌లోనే ఔటయ్యారు. 

ఇంగ్లండ్‌ 259 ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్‌ 260
►టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్‌ అయింది.  వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నప్పటికి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ తలా ఇన్ని పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జేసన్‌ రాయ్‌ 41, మొయిన్‌ అలీ 34, ఓవర్టన్‌ 32 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా.. చహల్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీశాడు.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌.. ఇంగ్లండ్‌ 257/9
►45 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. 32 పరుగులు చేసిన క్రెయిగ్‌ ఓవర్టన్‌ చహల్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

హార్దిక్‌ పాండ్యా అదుర్స్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
►టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. దాటిగా ఆడతున్న లివింగ్‌స్టోన్‌ను(27 పరుగులు) మొదట వెనక్కి పంపిన పాండ్యా.. ఆ తర్వాత కెప్టెన్‌ బట్లర్‌(60 పరుగులు)ను పెవిలియన్‌ చేర్చాడు. ఈ రెండు క్యాచ్‌లు జడేజానే అందుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

హాఫ్‌ సెంచరీతో మెరిసిన బట్లర్‌.. ఇంగ్లండ్‌ స్కోరెంతంటే? 
►టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ కీలక సమయంలో అర్థసెంచరీ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన బట్లర్‌ ఈ మ్యాచ్‌లో ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. బట్లర్‌ 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బట్లర్‌ 56, లివింగ్‌స్టోన్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మొయిన్‌ అలీ(34) ఔట్‌.. ఐదో వికెట్‌ డౌన్‌
►నిలకడగా సాగుతున్న ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు జడేజా షాక్‌ ఇచ్చాడు. 34 పరుగులు చేసిన మొయిన్‌ అలీ జడేజా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బట్లర్‌ 40 పరుగులతో ​క్రీజులో ఉన్నాడు.

20 ఓవర్లలో ఇంగ్లండ్‌ 91/4
►టీమిండియాతో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ కాస్త కుదరుకుంది. 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. బట్లర్‌ 14, మొయిన్‌ అలీ 5 పరుగులతో ఆడుతున్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
►స్టోక్స్‌(27) రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

జేసన్‌ రాయ్‌(41) ఔట్‌.. 10 ఓవర్లలో 66/3
►టీమిండియాతో జరుగుతున్న వన్డేలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రాయ్‌(41 పరుగులు) హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఏడు ఓవర్లలో ఇంగ్లండ్‌ 49/2
►ఏడు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. స్టోక్స్‌ 22, జేసన్‌ రాయ్‌ 26 పరుగులతో ఆడుతున్నారు.

రూట్‌ డకౌట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
►ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. సిరాజ్‌ ఒకే ఓవర్లో రెండో వికెట్లు తీయడం విశేషం.

బెయిర్‌ స్టో డకౌట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
►టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ బెయిర్‌ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ వికెట​ నష్టానికి 12 పరుగులు చేసింది. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా
►టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య చివరి వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్‌ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్ల సమంగా నిలిచిన స్థితిలో ఆఖరి పోరు నిర్ణయాత్మకంగా మారింది.

ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్‌ సన్నద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో గెలిచి రెండో మ్యాచ్‌లో 100 పరుగులతో ఓడిన రోహిత్‌ సేన చివరి సమరంలో సత్తా చాటుతుందా చూడాలి. టీమిండియా జట్టులో ఒక మార్పు జరిగింది. బుమ్రా స్థానంలో సిరాజ్‌ తుదిజట్టులోకి వచ్చాడు.  

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

పిచ్, వాతావరణం
►సాధారణ వికెట్‌. బ్యాటింగ్‌కు అనుకూలం. వర్షం సమస్య లేదు. ఓల్డ్‌ట్రఫోర్డ్‌ మైదానంలో గత 9 వన్డేల్లో ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement