భారత జట్టు(PC: BCCI)
India Vs England T20: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జూలై 7) నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. సౌతాంప్టన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ ఈ సిరీస్‌తో తొలిసారిగా విదేశీ గడ్డపై భారత్ తలపడే మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు కోవిడ్ బారిన పడిన అతడు.. కోలుకున్న కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రీషెడ్యూల్డ్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు వారు దూరంగా ఉంటారు.
మరి పటిష్ట జట్లు అయిన టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 ఫార్మాట్‌లో ముఖాముఖి రికార్డులు, ఎవరిది పైచేయి? మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? ప్రత్యక్ష ప్రసారం, తుది జట్ల అంచనా తదితర వివరాలు తెలుసుకుందాం!
అక్కడైతే ఇంగ్లండ్‌దే ఆధిక్యం!
భారత్- ఇంగ్లండ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 19 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 10 మ్యాచ్‌లలో టీమిండియా గెలవగా, తొమ్మిదింట ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ గడ్డపై ఇరు జట్లు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో నాలుగు సార్లు ఇంగ్లండ్, రెండుసార్లు భారత్ గెలుపొందాయి.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మొదటి టీ20
తేదీ: జూలై 7
వేదిక: ది రోజ్ బౌల్ స్టేడియం, సౌతాంప్టన్
సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకు(10:30 PM)
ప్రత్యక్ష ప్రసారం: సోనీ సిక్స్‌లో
తుది జట్ల అంచనా:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్ బ్యాటర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యజువేంద్ర చహల్.
ఇంగ్లండ్:
జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), జేసన్ రాయ్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, మాథ్యూ పార్కిన్సన్.
చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్!
Comments
Please login to add a commentAdd a comment