నా ఆటకు అప్పుడే గ్యారంటీ లేదు.. ఇప్పుడేంటి: ధోని | IPL 2021: Cant Guarantee Performances When I Am 40, MS Dhoni | Sakshi
Sakshi News home page

నా ఆటకు అప్పుడే గ్యారంటీ లేదు.. ఇప్పుడేంటి: ధోని

Published Tue, Apr 20 2021 3:04 PM | Last Updated on Tue, Apr 20 2021 4:25 PM

IPL 2021: Cant Guarantee Performances When I Am 40, MS Dhoni - Sakshi

Photo Courtesy: BCCI

ముంబై:  రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా సీఎస్‌కే గెలుపును ఖాతాలో వేసుకుంది.  189 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్‌143 పరుగులకే పరిమితమై  ఓడిపోయింది. ప్రధానంగా మాస్టర్‌ కెప్టెన్‌ ధోని గేమ్‌ ప్లానింగ్‌కు రాజస్థాన్‌ తలవంచింది. మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ..  ‘ నేను ఎప్పుడూ ఏ సమయంలో ఏది మంచి అనిపిస్తే దాని కోసమే ప్రయత్నిస్తా. ఎప్పూడూ నా దృష్టి అంతా గేమ్‌పై ఫోకస్‌ చేయడంపైనే ఉంటుంది. ఏది మంచి అనిపిస్తే అది చేస్తా’ అని తెలిపాడు.

ఇక 17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన తన ప్రదర్శన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 40వ ఒడిలో ఉన్న తన ప్రదర్శనపై గ్యారంటీ ఏముంటుంంటూ వ్యాఖ్యానించాడు. తాను 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఫెర్ఫార్మెన్స్‌ పరంగా గ్యారంటీ లేదని,  అటువంటప్పుడు 40 ఏళ్లు ఉండగా ఆటపై  గ్యారంటీ ఏముంటుందన్నాడు. తన ప్రదర్శన బాలేదని, తను అన్‌ఫిట్‌ అని ప్రజలు అనుకోకపోతే అది సానుకూలాంశమన్నాడు.

ప్రదర్శన అనే దాన్ని వేరే కోణంలో చూడాలి కానీ, దానికి గ్యారంటీలు పెట్టుకోకూడదని సరదాగా మాట్లాడాడు. తాము ఈ మ్యాచ్‌లో ఇంకా ఎక్కువ స్కోరు చేస్తామని భావించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తాను ఆడిన ఆరు బంతులకు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాననే విషయం ఒప్పుకున్నాడు. అది పెద్దగా ప్రభావం చూపకపోయినా, వచ్చే మ్యచ్‌లో ప్రభావం చూపదనే గ్యారంటీ ఉండదన్నాడు. 

ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. 
ఇక్కడ చదవండి: నాకు ఎలా ఆడాలో తెలుసు..ఆంక్షలు ఏంటి?  సామ్సన్‌
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement