Photo Coutesy: Instagram
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో బుధవారం ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఆర్‌సీబీకి మద్దతుగా నిలిచిన ఆమె తన చర్యలు, హావభావాలతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.''నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం.
నిజంగా మ్యాచ్ ఒక థ్రిల్లర్‌ను తలపించింది.. మిడిల్ ఓవర్లలో ఒకవైపు ఎస్‌ఆర్‌హెచ్ వికెట్లు పడుతున్న టార్గెట్ తక్కువగా ఉండడంతో కొంచెం భయం వేసింది. మా జట్టు విజయం సాధించాలంటూ గట్టిగా గట్టిగా అరవడంతో మా గొంతు నొప్పిపుట్టింది. ఏదైతేనేం ఆర్‌సీబీ విజయం సాధించింది.. ఇది కచ్చితంగా టీం వర్క్ అని చెప్చొచ్చు ''అని కామెంట్ చేసింది. కాగా ధనశ్రీ వర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా చహల్‌కు ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్ వందోది కావడం మరో విశేషం. అయితే చహల్ మాత్రం బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసిన చహల్ 29 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
మ్యాక్స్‌వెల్(59; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి(33; 29 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. ఓ దశలో రషీద్ ఖాన్(17) గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్నా రనౌట్ కావడంతో సన్‌రైజర్స్ ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ పరాజయం చెందింది.
చదవండి: అతనికి కోహ్లి ఒక గొప్ప ఆస్తి: బ్రెట్ లీ
Comments
Please login to add a commentAdd a comment