
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు పిన్న వయసులో కెప్టెన్‌గా పనిచేసిన జాబితాలో రిషబ్ పంత్ ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్‌లో పిన్న వయస్సులోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వారిలో స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి (ఆర్‌సీబీ), సురేశ్ రైనా(సీఎస్‌కే), శ్రేయాస్ అయ్యర్(డీసీ)లు ఉన్నారు.
తాజాగా అయ్యర్ భుజం గాయంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్(23) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే రిషబ్ పంత్ ముంగిట మరో రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. ఒకవేళ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గనుక సాధిస్తే అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృషించనున్నాడు. ఇక గతేడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చదవండి: ఫ్యాన్స్.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటారో వినండి
రనౌట్ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్
Comments
Please login to add a commentAdd a comment