Photo Courtesy: IPL Twitter
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేసిన పంత్ అనూహ్యంగా రియాన్ పరాగ్ వేసిన అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ 4వ బంతిని పంత్ లెగ్ సైడ్ దిశగా ఆడాడు. అయితే అక్కడ సింగిల్ తీసే అవకాశం లేకున్నా పంత్ అనవసర ప్రయత్నం చేశాడు. దీంతో పరాగ్ వేగంగా స్పందించి నేరుగా వికెట్ల వైపు విసిరాడు. పరాగ్ వేసిన డైరెక్ట్ త్రోకు పంత్ అవుట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. పంత్‌ను అవుట్ చేసిన ఆనందంలో పరాగ్ డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే పంత్ హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. పంత్ మినహా మిగతావారెవరు చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఉనాద్కట్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఒక వికెట్ తీశాడు. కాగా 148 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చదవండి: సంజూ సూపర్ క్యాచ్.. బిక్కమొహం వేసిన ధావన్
#IPL2021 #RR
— The Field (@thefield_in) April 15, 2021
Riyan Parag's celebration is a thing of joy!
🎥 IPLpic.twitter.com/YYk3lsGwZA
Comments
Please login to add a commentAdd a comment