రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
కెప్టెన్: విరాట్ కోహ్లి
ఉత్తమ ప్రదర్శన: 2009, 2011, 2016 ఫైనలిస్ట్
ఆరంభం నుంచి పేపర్‌పై బలంగా కనిపించే జట్టు ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 2009, 2011, 2016లో ఐపీఎల్ రన్నరఫ్‌గా నిలిచిన ఆర్‌సీబీ గత సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకొని క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఈ సీజన్‌లో మరోసారి బ్యాటింగ్ బలంతోనే ఆర్‌సీబీ బరిలోకి దిగనుంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారీ మొత్తం వెచ్చించి దక్కించుకొన్న ఆర్‌సీబీ అతనిపై భారీగా అంచనాలు పెట్టుకుంది. ఆర్‌సీబీ తాను ఆడనున్న 14 లీగ్ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు కోల్‌కతా..4మ్యాచ్‌లు అహ్మదాబాద్.. 3 మ్యాచ్‌లు చెన్నై.. 2 మ్యాచ్‌లు ముంబై వేదికగా ఆడనుంది.
చదవండి: ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసేనా
బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, పవన్ దేశ్‌పాండే, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, ఎబి డివిలియర్స్(వికెట్‌కీపర్) , జోష్ ఫిలిప్(వికెట్ కీపర్), మహ్మద్ అజరుద్దీన్(వికెట్ కీపర్), కెఎస్ భరత్(వికెట్ కీపర్)
బౌలర్లు: మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్ , ఆడమ్ జాంపా ,కేన్ రిచర్డ్సన్
ఆల్‌రౌండర్లు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, వాషింగ్టన్ సుందర్, డేనియల్ సామ్స్, కైల్ జేమిసన్, డానియల్ క్రిస్టియన్, సయాష్ ప్రభు దేశాయ్, హర్షల్ పటేల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మ్యాచ్‌లు:
తేది | జట్లు | వేదిక | సమయం |
ఏప్రిల్ 9 | ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 14 | ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ | చెన్నై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 18 | ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్.. | చెన్నై | సాయంత్రం 3.30 గంటలు |
ఏప్రిల్ 22 | ఆర్‌సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 25 | ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే.. | ముంబై | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 27 | ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
ఏప్రిల్ 30 | ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 3 | ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్.. | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 6 | ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ | అహ్మదాబాద్ | రాత్రి 7.30 గంటలు |
మే 9 | ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్.. | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 14 | ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 16 | ఆర్‌సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ | కోల్‌కతా | సాయంత్రం 3.30 గంటలు |
మే 20 | ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
మే 23 | ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే.. | కోల్‌కతా | రాత్రి 7.30 గంటలు |
Comments
Please login to add a commentAdd a comment