
బెంగళూరు: ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆర్‌సీబీ కొత్త ఉత్సాహంతో సిద్దమవుతుంది. ప్రతీ సీజన్‌లోనూ పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ అసలు సమయంలో మాత్రం చతికిలపడుతుంది. కాగా గతేడాది సీజన్‌లో మాత్రం ఆర్‌సీబీ కాస్త మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్ వరకు వచ్చింది. అయితే కీలక సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో పరాజయం పాలై ఒట్టి చేతులతో వెనుదిరిగింది. ఈసారి ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్ రాకతో ఆర్‌సీబీ మరింత బలంగా కనిపిస్తుంది. తాజాగా కోహ్లి, డివిలియర్స్, దేవ్‌దూత పడిక్కల్ మధ్య ట్విటర్ వేదికగా జరిగిన వీడియో చాటింగ్ నవ్వులు పూయిస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. మొదట కోహ్లి తన ఇంట్లోని ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీసున్న వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన డివిలియర్స్ వావ్ కోహ్లి.. నీ కసరత్తు పరుగులు తీస్తుంది.. ఇంట్లో నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నావు..నేను కూడా అన్ని ప్యాక్ చేశా.. ఐపీఎల్ ఆడేందుకు వస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. దీనిక బదులుగా కోహ్లి..'' ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా వికెట్ల మధ్య నువ్వు వేగంగా పరిగెత్తగలుగుతావు.. నేను నిన్ను అందుకోవాలి..'' అని తెలిపాడు. దీనికి డివిలియర్స్.. ''అయితే ఇప్పుడు మనిద్దరం సరదాగా రన్నింగ్ రేస్ పెట్టకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం'' అని తెలిపాడు. రన్నింగ్ రేస్‌లో కోహ్లి, డివిలియర్స్ పోటీ పడి పరిగెత్తారు.. ఒకదశలో కోహ్లిని డివిలియర్స్ దాటేశాడు.
చదవండి: IPL 2021: ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసేనా
ఇంతలో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కోహ్లి, డివిలియర్స్‌ను దాటుకుంటూ దేవదూత్ పడిక్కల్ వేగంగా పరిగెత్తుతూ చివరన ఉన్న లైన్‌ను టచ్ చేశాడు. ''మీకన్నా ముందు నేను ప్రాక్టీస్ ప్రారంభించా.. అందుకే ఇంత వేగంగా పరిగెత్తా .. అయినా సరే మీలాంటి సీనియర్ క్రికెటర్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'' అంటూ దేవదూత్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా పూమా క్రికెట్ ప్రమోషన్‌లో భాగంగా చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఏప్రిల్ 9న ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్‌కు తెరలేవనుంది.
చదవండి:
ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ సుయాజ్‌లో చిక్కుకున్నా!
One of us wins, all of us win. Am I right? 😉 Hello, @RCBTweets's newest and fastest teammate @pumacricket pic.twitter.com/XHmKTiAgkc
— Virat Kohli (@imVkohli) March 30, 2021