Photo Courtesy: BCCI/IPL
చెన్నై: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ రోజు(ఏప్రిల్ 23వ తేదీ) పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా టాస్‌కు వచ్చిన సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ ముందుగా చేయాల్సి వచ్చినప్పుడు సమిష్టిగా ఎలా బ్యాటింగ్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నామన్నాడు. టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్‌కు వెళ్లాల్సివచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా రోహిత్ తెలిపాడు. గత కొన‍్ని మ్యాచ్‌ల్లో తాము తప్పులు చేశామన్న రోహిత్.. ఇకపై వాటిని సరిచేసుకుని ముందుకు సాగుతామన్నాడు. ప్రస్తుత మ్యాచ్‌లో ఆడటానికి వచ్చిన సమయంలో ఆకాశంలో చూస్తే మేఘాలున్నాయని, దాంతో డ్యూ ఉండదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక తన కండరాల గాయంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నాడు. అది చాలా చిన్నగాయమని, ఇప్పుడంతా బాగానే ఉందన్నాడు.
కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. తాము ఆడిన గత మ్యాచ్‌లో మొత్తం రిథమ్ కోల్పోయామన్నాడు. తాము ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరు చేశామన్నాడు. ఇకనైనా మిడిల్ ఆర్డర్ గాడిలో పడుతుందని అనుకుంటన్నట్లు రాహుల్ తెలిపాడు. అది 170 పరుగుల వికెట్ కాదని, అయినా ఆ మ్యాచ్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నామన్నాడు. ఇక్కడ వికెట్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటందని భావిస్తున్నానన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకూ ఇరుజట్లు 26సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ముంబై ఇండియన్స్ 14సార్లు, పంజాబ్ కింగ్స్ 12సార్లు విజయం సాధించాయి. ఇక ఇరుజట్లు తలపడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింట, పంజాబ్ రెండిట గెలుపును అందుకున్నాయి. గత సీజన్‌లో పంజాబ్, ముంబైలు తలో విజయం సాధించాయి. ఆ సీజన్‌లో ఇరుజట్లు తలపడిన తొలి అంచె మ్యాచ్‌లో ముంబై 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోగా, రెండో మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడటం విశేషం. తొలి సూపర్ ఓవర్‌లో ఇరుజట్లు 5 పరుగులే చేయగా, రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఆ సూపర్ ఓవర్ పంజాబ్ 15 పరుగులు చేయగా, ముంబై 11 పరుగులే చేసింది.
ఇక్కడ చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యామిలీని మిస్సవుతున్నా
ఎక్కడ చూసినా పరుగులే.. భారత్‌కు ఆడటం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment