సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. డేవిడ్ మిల్లర్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో స్టాండింగ్ కెప్టెన్ రషీద్ ఖాన్ 21 బంతుల్లో 40 పరుగులు సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఖాన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 90 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. చివర్లో రషీద్ ఔటైనప్పటికి మిల్లర్ మిగతాపనిని పూర్తి చేశాడు. సీఎస్కే బౌలర్లలో బ్రావో 3, తీక్షణ 2, ముకేష్ చౌదరీ, జడేజా చెరొక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment