గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: Gujarat Titans)
IPL 2022: Gujarat Titans Skipper Hardik Pandya Emotional Video Viral: ‘‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.. నేను మీ కెప్టెన్... కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మాట్లాడుతున్నాను. ఇదంతా నిజంగా చాలా కొత్తగా ఉంది. కానీ.. ఒక్క మాట చెప్పదలచుకున్నా... నేను ఎక్కడి వచ్చానో చెప్పనక్కర్లేదు.. ఆ విషయం మీకు తెలుసనే అనుకుంటాను. అయితే, మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకువెళ్లగలనో మాత్రం చెప్పగలను. విజయతీరాలకు చేర్చి శిఖరంపై నిలబెడతాను.
ఇదొక మధురమైన, ఉన్నతమైన ఆట. ఈ ఆటలో నా సోదరుడు(ఎంఎస్ ధోని) తన అసాధారణ ప్రతిభతో ఓ గీత గీశాడు. నేను ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయనతోనే పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాను. నా హీరో(సచిన్ టెండుల్కర్) స్ఫూర్తిదాయక మాటలు వింటూ ఇక్కడిదాకా వచ్చాను.
ఈ ప్రయాణంలో నేను నా తోబట్టువుతో పోటీపడాల్సి ఉంటుంది. నా సన్నిహితులతో తలపడాల్సి వస్తుంది. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపళ్లాలు. కానీ ఒక్కమాట. నేను నిషేధం ఎదుర్కొన్నాను.. గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాను. ఇంకా ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. అయినా, సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. నా జట్టును అలాగే తీర్చిదిద్దుతాను.
కాబట్టి మా ఈ సాహసోపేతమైన ప్రయాణాన్ని వీక్షించడానికి మీరు సిద్ధంగా ఉండండి’’ అంటూ ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశాడు. తన జీవితం, క్రికెట్ కెరీర్‌లోని ఒడిదుడుకులు, చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. వాటిని అధిగమించడంలో తనకు సహాయపడిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
అభిమానులకు కచ్చితంగా వినోదం పంచుతామని, అంచనాలు అందుకుంటామని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కాగా మార్చి 28న మరో కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా.. అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
చదవండి: IPL 2022 MI Vs DC: 6,1,6,4,1,6.. ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అదే.. అందుకే ఓడిపోయింది!
❤️ Goosebumps on our debut day, courtesy captain @hardikpandya7 ▶️ pic.twitter.com/2qdwn5FKrc
— Gujarat Titans (@gujarat_titans) March 28, 2022
Comments
Please login to add a commentAdd a comment