IPL 2022: Kane Williamson Creates Record in IPL Winning 6 Tosses in a Row - Sakshi
Sakshi News home page

PBKS VS SRH: వరుసగా 6 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన విలియమ్సన్‌

Published Sun, Apr 17 2022 5:09 PM | Last Updated on Sun, Apr 17 2022 5:43 PM

IPL 2022: Kane Williamson Creates Record In IPL Winning 6 Tosses In A Row - Sakshi

Kane Williamson: ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచి టాస్‌ కా బాస్‌ అనిపించుకున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేన్‌ మామ డబుల్‌ హ్యాట్రిక్‌ టాస్‌ విక్టరీస్‌ సాధించాడు. ప్రస్తుత సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచే విలియమ్సన్‌ టాస్‌ విజయాల పరంపర మొదలైంది.


తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌, రెండో మ్యాచ్‌లో లక్నో, మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఐదో మ్యాచ్‌లో కేకేఆర్‌.. ఇలా బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ విలియమ్సన్‌ టాస్‌ గెలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ కలుపుకుని ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా  3 విజయాలు (హ్యాట్రిక్‌) సాధించింది. 

కాగా, ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా పంజాబ్‌ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో మయాంక్‌ స్థానంలో శిఖర్‌ ధవన్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు సాధించింది. లివింగ్‌స్టోన్‌ (51), షారుక్‌ ఖాన్‌ ధాటిగా ఆడుతున్నారు. 
చదవండి: అదృష్టం అంటే దీపక్‌ చాహర్‌దే.. ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా 14 కోట్లు రికవరీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement