
PC: IPL.com
ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినఎస్‌ఆర్‌హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఒక దశలో వంద పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో అబ్దుల్ సమద్(32 నాటౌట్), ఉమ్రాన్ మాలిక్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో వంద పరుగులు దాటగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, అశ్విన్, హోల్డర్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 83 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఆదిల్ రషీద్ చహల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
► ఓటమి దిశగా ఎస్‌ఆర్‌హెచ్.. 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మారని ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు.. 34 పరుగులకే మూడు వికెట్లు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా హ్యారీ బ్రూక్(13 పరుగులు) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
టార్గెట్ 204.. సున్నాకే రెండు వికెట్లు
ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు ఏం మారలేదు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ సున్నా పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. బౌల్ట్ తన తొలి ఓవర్లోనే ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. తొలుత అభిషేక్ శర్మను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి డకౌట్‌గా వెనుదిరిగాడు. జేసన్ హోల్డర్ స్టన్నింగ్ క్యాచ్‌కు త్రిపాఠి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ 204
ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి 200 స్కోరు దాటింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రాజస్తాన్ టాప్-3 బ్యాటర్లు జాస్ బట్లర్(54), యశస్వి జైశ్వాల్(54), సంజూ శాంసన్(55) అర్థ శతకాలతో రాణించారు. చివర్లో హెట్‌మైర్ 22 పరుగులు సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో టి. నటరాజన్, ఫజల్లా ఫరుకీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు మాత్రమే చేసిన దేవదత్ పడిక్కల్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకముందు ఫిఫ్టీ మార్క్ అందుకున్న యశస్వి జైశ్వాల్ 54 పరుగులు చేసి ఫరుకీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 39, రియాన్ పరాగ్ నాలుగు పరుగులతో ఆడుతున్నారు.
దంచికొడుతున్న రాజస్తాన్.. 10 ఓవర్లలోనే 122/1
బట్లర్ అందించిన ఆరంభాన్ని రాజస్తాన్ రాయల్స్ కంటిన్యూ చేస్తోంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్ నష్టానికి 122 పరుగులుగా ఉంది. జైశ్వాల్ 46, సంజూ శాంసన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ 85/1
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ ధాటిగా ఆరంభించింది. జాస్ బట్లర్ మరోసారి గతేడాది ఐపీఎల్‌ను గుర్తుచేస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న బట్లర్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక బట్లర్ విధ్వంసంతో తమ ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ప్రస్తుతం రాజస్తాన్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. అయితే బట్లర్ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే పెవిలియన్ చేరాడు.
2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 20/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(3), జైస్వాల్(16) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2023లో మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ దూరం కావడంతో భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), T నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ
చదవండి: NZ vs SL: పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్‌లో
Comments
Please login to add a commentAdd a comment