ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు.
18 ఓవర్లలో లక్నో 179/4
18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.
పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నో
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
8 ఓవర్లలో లక్నో 89/1
8 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యం
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్‌లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.
18 ఓవర్లలో పంజాబ్ 230/5
18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
కూపర్ (87) ఔట్
పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మణిమరన్ సిర్థార్థ్‌కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.
9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.
ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1
పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.
5 ఓవర్లలో పంజాబ్ 43/1
5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ప్రబ్‌సిమ్రన్ డకౌట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ముల్లన్‌పూర్ వేదికగా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
లక్నో సూపర్‌జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్


