
ఐర్లాండ్ మహిళల జట్టు సంచలనం సృష్టించింది. లాహోర్ వేదికగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన మూడో టీ20లో 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో ఐర్లాండ్ కైవసం చేసుకుంది. కాగా విదేశీ గడ్డపై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఐర్లాండ్‌కు ఇదే మొదటిసారి.
ఇక నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో గాబీ లూయిస్ 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. హంటర్(40) ,ఓర్లా ప్రెండర్‌గాస్ట్(37) పరుగులతో రాణించారు.
పాక్‌బౌలర్లలో నిదా ధార్, సందూ, ఫాథిమా తలా వికెట్ సాధించారు. ఇక 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 133 పరగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో జవేరియా ఖాన్(50) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ, కెల్లీ తలా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. జేన్ మాగైర్ రెండు, రిచర్డ్‌సన్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment