చర్రిత సృష్టించిన జస్ప్రీత్‌ బుమ్రా.. కపిల్‌ దేవ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ | Jasprit Bumrah Breaks Kapil Devs Record, Becomes Leading Indian Wicket-taker In Australia, See More Details | Sakshi
Sakshi News home page

IND vs AUS: చర్రిత సృష్టించిన జస్ప్రీత్‌ బుమ్రా.. కపిల్‌ దేవ్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published Wed, Dec 18 2024 8:50 AM | Last Updated on Wed, Dec 18 2024 10:08 AM

 Jasprit Bumrah breaks Kapil Devs record, becomes leading Indian wicket-taker in Australia

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వి​కెట్లతో సత్తాచాటిన బుమ్రా.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మాయ చేస్తున్నాడు.

ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు షాకిచ్చాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మార్నస్‌ లబుషేన్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో బుమ్రా 52 టెస్టు వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌(51) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్‌దేవ్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.  ఈ మ్యాచ్‌లో బుమ్రా ఓవరాల్‌గా 9 వికెట్ల పడగొట్టాడు.

భారత టార్గెట్‌ ఎంతంటే?
ఇక బ్రిస్బేన్‌ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 185 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. 

భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ఆకాష్‌ దీప్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు  252/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: SA vs PAK 1st Odi: సల్మాన్ ఆల్‌రౌండ్‌ షో.. సౌతాఫ్రికాపై పాక్‌ విజయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement