ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్-2023తో ఇద్దరు టీమిండియా స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌లు ఆసియాకప్‌లో ఆడతారని IE పేర్కొంది. వీరితో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) రిహాబ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, అతని రీఎంట్రీకి మరింత సమయం పట్టవచ్చని తెలిపింది.
కాగా, వెన్ను సమస్య కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బుమ్రా.. ఇటీవలే పూర్తిగా కోలుకుని, ప్రస్తుతం నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అతను నెట్స్‌లో అవిశ్రాంతంగా 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కేఎల్ రాహుల్ సైతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, అయితే అతను ప్రాక్టీస్ ప్రారంభించేందుకు మరో వారం సమయం పట్టవచ్చని సమాచారం.
శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. ఈ మిడిలార్డర్ బ్యాటర్ చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. గాయానికి తగిన చికిత్స తీసుకున్నప్పటికీ అతను ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. అయ్యర్ ఇంకా ఇంజెక్షన్‌లపైనే ఉన్నాడని సమాచారం. కొందరేమో అయ్యర్ వరల్డ్‌కప్ సమయానికి కోలుకోవడం కూడా అనుమానమేనని అంటున్నారు. దీంతో బీసీసీఐ అయ్యర్‌కు ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment