ఆసియాకప్-2023 పాకిస్తాన్, శ్రీలంక వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఈ మెరకు ఆసియా క్రికెట్ కౌన్సల్ గురువారం ఓ ప్రకటన చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ ఏడాది ఆసియా కప్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగానే జరగనున్నాయి.
టీమిండియాకు గుడ్‌న్యూస్..
ఇక ఆసియాకప్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ఆసియాకప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
ఆసియాకప్ సమయానికి అయ్యర్, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని ఏన్సీఏ వైద్య బృందం తెలిపినట్లు ఈఎస్పీఎన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా బుమ్రా తన వెన్ను గాయానికి న్యూజిలాండ్‌లో శస్త్ర చికిత్స చేసుకోగా.. అయ్యర్ లండన్‌లో సర్జరీ చేసుకున్నాడు.
చదవండి: భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కువైంది.. అందుకే ఇలా: వెస్టిండీస్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment