
టీమిండియా యువ క్రికెటర్ జితేష్ శర్మ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం (ఆగస్టు 8) జితేష్ తన చిన్ననాటి స్నేహితురాలు శలక మకేశ్వర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఈ మహారాష్ట్ర క్రికెటర్ పంచుకున్నాడు.
దీంతో ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. భారత క్రికెటర్లు రుతరాజ్ గైక్వాడ్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు సైతం జితేష్-మకేశ్వర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. నాగపూర్ చెందిన శలాకా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
ఇక జితేష్ శర్మ విషయానికి వస్తే.. టీమిండియాతో పాటు ఐపీఎలో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల ద్వారా భారత జట్టు తరపున అరంగ్రేటం చేశాడు.
కానీ తనకు వచ్చిన అవకాశాన్ని జితేష్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన జితేష్ కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 40 మ్యాచ్‌లు ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment