వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే మరి కొంతమంది ఐపీఎల్ హీరోలకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అందులో ముందు వరుసలో ఉంటాడు పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. జితేష్ శర్మ ఈ ఏడాది సీజన్‌లో అదరగొట్టాడు.
లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 156.06 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. కాగా అంతకు ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు భారత జట్టులో జితేష్‌కు చోటు దక్కినప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక తాజాగా ఓ ఇంటరర్వ్యూలో విండీస్ టూర్‌కు చోటు దక్కకపోవడంపై జితేష్ శర్మ స్పందించాడు.
విండీస్ టూర్‌కు ఎంపికకాకపోవడం గురించి ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్ వేశాడు’’ ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. రాహల్ ద్రవిడ్ సార్ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నారు. మీరు చాలా బాగా రాణిస్తున్నారని, మేము మీలాంటి యువ ఆటగాళ్ల కోసం వెతుకుతున్నామని ద్రవిడ్ సార్ చెప్పారు.
నేను ఇంకా ఎక్కువగా పరుగులు సాధించాలని అనుకుంటున్నాని అతనితో చెప్పాను. అందుకు బదులుగా ఆయన నేను ఆడే పోజేషన్‌కు అవే ఎక్కువ పరుగులు అని కితాబు ఇచ్చారు. పరుగులు కాదు గెలుపు కోసం మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తారో అది ముఖ్యమని ఆయన అన్నారు" అని క్రికెట్.కామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: Rohit Sharma: 'ఆటగాళ్ల మధ్య దూరానికి అది కూడా కారణమే.. రోహిత్ కెప్టెన్సీ అంతగా బాగోలేదు'
Comments
Please login to add a commentAdd a comment