కొంత భయమైతే ఉంది: విలియమ్సన్‌  | Kane Williamson Shows Little Bit Of Apprehension | Sakshi
Sakshi News home page

కొంత భయమైతే ఉంది: విలియమ్సన్‌ 

Sep 3 2020 8:10 AM | Updated on Sep 19 2020 3:45 PM

Kane Williamson Shows Little Bit Of Apprehension - Sakshi

వెల్లింగ్టన్‌: కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ ఆడే విషయంలో తాను సహజంగానే ఆందోళనకు లోనవుతున్నట్లు న్యూజిలాండ్‌ కెప్టెన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యుడు కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. లీగ్‌లో పాల్గొంటున్న ఆరుగురు కివీస్‌ ఆటగాళ్లలో అతనొకడు. త్వరలోనే విలియమ్సన్‌ హైదరాబాద్‌ జట్టుతో చేరతాడు. ‘కోవిడ్‌–19 విషయంలో జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఒక్కో జట్టు వేర్వేరు హోటల్‌లో ఉంటోంది.

అయినా సరే కొందరికి కరోనా రావడం బాధాకరం. ఎవరైనా ఈ మహమ్మారి బారిన పడ్డారనే వార్త వినాలని మనం ఎవరమూ కోరుకోం. త్వరలోనే వారంతా పూర్తి స్థాయిలో కోరుకుంటారని ఆశిస్తున్నా. ఐపీఎల్‌ దగ్గర పడుతున్న కొద్దీ సహజంగానే కొంత భయం నెలకొని ఉంది. మున్ముందు ఎంత జాగ్రత్తగా, క్రమశిక్షణగా ఉండాలనే ఆలోచన మొదలైపోయింది’ అని విలియమ్సన్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement