కేకేఆర్‌ బౌలర్‌కు గాయం.. సర్జరీ సక్సెస్‌ | KKR Spinner Kuldeep Yadav Undergoes Successful Knee Surgery | Sakshi
Sakshi News home page

Kuldeep yadav: కేకేఆర్‌ బౌలర్‌కు గాయం.. సర్జరీ సక్సెస్‌

Published Wed, Sep 29 2021 6:35 PM | Last Updated on Wed, Sep 29 2021 7:08 PM

KKR Spinner Kuldeep Yadav Undergoes Successful Knee Surgery - Sakshi

Photo Courtesy: Twitter

Kuldeep Yadav Undergoes Successful Knee Surgery: కోల్‌కత నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ మోకాలి గాయానికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. సర్జరీ అనంతరం ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను కుల్దీప్‌ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. సర్జరీ సక్సెస్ అయినట్లు పేర్కొన్నాడు. కష్ట సమయంలో  అండగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెడతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

కాగా, ఐపీఎల్‌-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సెప్టెంబర్‌ 26)తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో కుల్దీప్‌ గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేకేఆర్‌ యాజమాన్యం సెప్టెంబర్‌ 27న తమ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. దీంతో అతను జట్టును వదిలి భారత్‌కు తిరుగు పయనమయ్యాడు. ముంబైలోని ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో అతని కాలి​కి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. 

ఇదిలా ఉంటే, కుల్దీప్‌ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో పాటు త్వరలో ప్రారంభంకానున్న దేశవాళీ సీజన్‌ను కూడా మిస్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన కుల్దీప్‌.. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్‌ జట్టుకు కూడా ఎంపిక కాలేదు.
చదవండి: సెహ్వాగ్‌ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ కెప్టెన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement