
కోల్‌కతా: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) గ్రూప్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టింది. అగ్రదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం అమెరికన్ క్రికెట్ ఎంటర్‌ప్రైజెస్ (ఏసీఈ)లో పెట్టుబడులు పెట్టామని కేకేఆర్ తెలిపింది. ‘కొన్నేళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఇందులో భాగంగానే యూఎస్‌ఏలో టి20 క్రికెట్‌పై దృష్టి పెట్టాం. అందుకే అక్కడి మేజర్ లీగ్ క్రికెట్‌ను మా వ్యాపార ప్రణాళికల్లో చేర్చాం. తాజాగా స్టేక్ హోల్డర్‌గా చేరాం’ అని షారుఖ్ తెలిపారు. ఇందులో ఆయన మిత్రురాలు, హీరోయిన్ జూహీ చావ్లా సహ యజమానిగా ఉంది. కరీబియన్ క్రికెట్ లీగ్‌లోనూ షారుఖ్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment