MI vs RCB Predicted XI: Tilak Varma to return? - Sakshi
Sakshi News home page

IPL 2023: ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్‌ వర్మ బ్యాక్‌! అతడు కూడా

Published Tue, May 9 2023 2:31 PM | Last Updated on Tue, May 9 2023 2:47 PM

MI vs RCB XI: Tilak Varma to return? - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే ఇరు జట్లుకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఈ రెండు జట్లు కూడా తమ గత మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతున్నాయి. 

ఢిల్లీ చేతిలో ఆర్సీబీ ఓటమి చవిచూడగా.. సీఎస్‌కే చేతిలో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు మార్పులతో బరిలోకే దిగనున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ లేమితో స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో ఇంగ్లీష్‌ ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఆనారోగ్యం కారణంగా దూరమైన తిలక్‌ వర్మ కూడా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసే ఛాన్స్‌ ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అనుజ్‌ రావత్‌ స్థానంలో ప్రభ్‌దేశాయ్‌ రానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు చెరో 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదింట విజయం సాధించాయి.

తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్‌: ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోర్డాన్‌, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్

ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, కరణ్‌ శర్మ మహ్మద్ సిరాజ్
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! జోర్డాన్‌ ఎం‍ట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement