ఐపీఎల్-2025లో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో ‘అన్‌క్యాప్డ్’ ఓల్డ్ పాలసీని తిరిగి తీసుకురావాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం.. ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగించేందుకు వీలు ఉంటుంది. కాగా గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో అన్‌క్యాప్డ్ పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని సీఎస్‌కే ప్రతిపాదించింది.
కానీ ఇతర ప్రాంఛైజీల నుంచి మాత్రం సీఎస్‌కేకు మద్దతు లభించలేదు. అయితే మిగితా ఫ్రాంచైజీల నుంచి చెన్నైకు సపోర్ట్ లభించకపోయినప్పటికి.. బీసీసీఐ మాత్రం అన్‌క్యాప్డ్ రిటర్న్ పాలసీని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ధోని మరో ఐపీఎల్ ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. మిస్టర్ కూల్‌ను ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్‌కే రిటైన్ చేసుకోనుంది. అయితే అందుకు ధోని మరి ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.
‘అన్‌క్యాప్డ్’ పాలసీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన సమావేశంలో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చజరిగింది. త్వరలోనే ప్లేయర్స్ రిటెన్ష్ రూల్స్‌తో పాటు ఈ పాలసీ కోసం ప్రకటించే ఛాన్స్ ఉందని బీసీసీఐ మూలాలు వెల్లడించాయి.
కాగా ప్రస్తుత రూల్స్ ప్రకారం మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. అయితే ఈ రిటైన్ చేసే ఆటగాళ్ల సంఖ్యలను పెంచాలని ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు మొగ్గు చూపడం లేదు. బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.
అసలేంటి ఈ అన్‌క్యాప్డ్ పాలసీ?
ఐపీఎల్ తొలి సీజన్(2008)లో అన్‌క్యాప్డ్ పాలసీని నిర్వహకులు తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడనైనా అనక్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించవచ్చు.
కానీ ఈ నియమాన్ని ఫ్రాంచైజీలు పెద్దగా ఉపయోగించకోకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు 2021 సీజన్‌లో తొలగించారు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ నియమం మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment