బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కి ముందు ఆస్ట్రేలియా-ఎ, భారత్-ఎ జట్లు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ క్రమంలో భారత్-ఎతో జరగబోయే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 17 మందితో కూడిన తమ 'ఎ' జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు యువ ఆటగాడు నాథన్ మెక్‌స్వీనీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, మార్కస్ హారిస్, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేజర్, టాడ్ మర్ఫీ వంటి స్టార్ క్రికెటర్లు ఎంపికయ్యారు.
అయితే టాడ్ మర్ఫీ ఒక్కడే ఆసీస్ సీనియర్ టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. స్కాట్ బోలాండ్, మైఖేల్ నేజర్ వంటి క్రికెటర్లు భారత్-ఎతో సిరీస్‌లో రాణించి ఆసీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు.
అదే విధంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ తన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీతో మెరిసిన సామ్ కొన్‌స్టాస్ కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటు జరగన్నాయి. ఈ సిరీస్‌కు భారత-ఎ జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
ఆస్ట్రేలియా ఎ జట్టు: నాథన్ మెక్‌స్వీనీ(కెప్టెన్), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్కాట్ బోలాండ్, జోర్డాన్ బకింగ్‌హామ్, కూపర్ కొన్నోలీ, ఆలీ డేవిస్, మార్కస్ హారిస్, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌ఆండ్రూ, మైఖేల్ నేజర్, టాడ్ మర్ఫీ, ఫెర్గూస్ ఓ'నీల్, జిమ్మీ పి పీర్‌సిప్‌సన్, జిమ్మీ పి పీర్సిప్‌సన్ , మార్క్ స్టెక్టీ, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: PAK vs AUS: ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేశాడు! విధ్వంసకర వీరులు దూరం
Comments
Please login to add a commentAdd a comment