బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం! | Mushfiqur Rahim Break-Records Joins Bangladesh Elite Test Century List | Sakshi
Sakshi News home page

బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం!

May 18 2026 4:56 PM | Updated on May 18 2026 5:47 PM

Mushfiqur Rahim Break-Records Joins Bangladesh Elite Test Century List

బంగ్లాదేశ్ సీనియ‌ర్ క్రికెట‌ర్ ముష్ఫిక‌ర్ ర‌హీమ్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున‌ టెస్టుల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ మార్క్ అందుకోవ‌డం ద్వారా బంగ్లాదేశ్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫిక‌ర్ ర‌హీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచ‌రీ.

త‌ద్వారా టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన బంగ్లా క్రికెట‌ర్‌గా ముష్ఫిక‌ర్ ర‌హీమ్ నిలిచాడు. 2005లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముష్ఫిక‌ర్ ర‌హీమ్ బంగ్లాదేశ్ త‌ర‌పు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 6వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు డ‌బుల్ సెంచ‌రీలు, 14 సెంచ‌రీలు, 29 అర్థ‌సెంచ‌రీలు ఉండ‌డం విశేషం. 

జింబాబ్వేతో టెస్టులో 219 ప‌రుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫిక‌ర్ ర‌హీమ్ బంగ్లాదేశ్ త‌ర‌ఫున డ‌బుల్ సెంచ‌రీ సాధించిన తొలి క్రికెట‌ర్‌గా, అలాగే బంగ్లా త‌ర‌ఫున మూడు ద్విశ‌త‌కాలు బాదిన ఏకైక క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ త‌ర‌ఫున అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన జాబితాలో ముష్ఫిక‌ర్ ర‌హీమ్ త‌ర్వాత మోమినుల్ హ‌క్ (13 సెంచ‌రీలు), ప్ర‌స్తుత బీసీబీ తాత్కాలిక అధ్య‌క్షుడు, మాజీ క్రికెట‌ర్‌ త‌మీమ్ ఇక్బాల్ (10 సెంచ‌రీలు), న‌జ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచ‌రీలు), లిట‌న్ దాస్ (6 సెంచ‌రీలు) ఉన్నారు. 

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 ప‌రుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. అంత‌క‌ముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 390 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (137) సెంచ‌రీ చేయ‌గా.. ఓపెన‌ర్ మ‌హ్మ‌దుల్ హ‌స‌న్ జాయ్ (52), లిట‌న్ దాస్ (69) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. 

పాక్ బౌల‌ర్ల‌లో ఖుర్ర‌మ్ షెహ‌జాద్ 4 వికెట్లు తీయ‌గా, సాజిద్ ఖాన్ 3, హ‌స‌న్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. త‌ద్వారా 56 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ క‌లుపుకొని ప్ర‌త్య‌ర్థి ముంగిట భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు.  చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండ‌డంతో అద్భుతం జ‌రిగితే త‌ప్ప పాకిస్తాన్ ఓట‌మి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్‌స్వీప్ అయిన‌ట్లే. 

చదవండి: IPL: లిటన్‌ దాస్‌ సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement