T20 WC 2022 NZ Vs IRE: New Zealand Beat Ireland By 35 Runs Reached Semis - Sakshi
Sakshi News home page

T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌!

Published Fri, Nov 4 2022 1:17 PM | Last Updated on Fri, Nov 4 2022 1:55 PM

New Zealand beat Ireland by 35 runs, Reaches Semis In T20WC 2022 - Sakshi

టీ20 ప్రపంచకప్‌(సూపర్‌-12)లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుం‍చి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్‌ ముందడుగు వేసింది. న్యూజిలాండ్‌తో పాటు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు కూడా ఏడు పాయింట్లు సాధించే వీలుంది. కానీ మెరుగైన రన్‌రేట్ ఉన్న కివీస్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. గ్రూపు-1 నుం‍చి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు +2.113 రన్‌ రేట్‌ ఉంది.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ విలియమ్సన్‌ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు అలెన్‌(32), మిచెల్‌(31) పరుగులతో రాణించారు. ఐరీష్‌ బౌలర్లలో లిటిల్‌ మూడు, డెలానీ, అడైర్‌ తలా వికెట్‌ సాధించారు.

మూడు వికెట్లతో చెలరేగిన లాకీ ఫెర్గూసన్
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు స్టిర్లింగ్‌, బాల్బిర్నీ అద్భతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వా‍మ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యక వరుస క్రమంలో ఐర్లాండ్‌ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో  లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌, సోధి, సౌథీ తలా వికెట్‌ సాధించారు.


చదవండి: T20 WC 2022 NZ Vs IRE: హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఐర్లాండ్‌ బౌలర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement