కివీస్ ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: ఐసీసీ)
క్రైస్ట్‌చర్చ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 286/3తో మంగళవారం ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెపె్టన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్‌లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. (చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం')
ఇక హెన్రీ నికోల్స్ (157; 18 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది. విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. న్యూజిలాండ్ తరఫున నాలుగో వికెట్‌కిదే అత్యధిక భాగస్వామ్యం. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే పాక్ మరో 354 పరుగులు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment