
ఐపీఎల్-2023లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన రాజస్తాన్ రాయల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా అద్భుత ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో గురువారం రాజస్తాన్ తలపడనుంది. ఈమ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి గాడిన పడాలని శాంసన్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కేవలం ఒకే మార్పుతో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.
పెద్దగా రాణించలేకపోతున్న ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ స్థానంలో స్పిన్నర్ ఆడమ్ జంపాకు అవకాశం ఇవ్వాలని రాజస్తాన్ మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి కచ్చితంగా జంపా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. పరాగ్ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శరన కనబరుస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవడంలో రియాన్ విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు మేనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. అదే విధంగా యువ ఆటగాడు దృవ్ జురల్‌ను రాజస్తాన్ కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జురల్ (42) ఆకట్టుకున్నాడు.
రాజస్తాన్ తుది జట్టు(అంచనా): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, అశ్విన్, సందీప్ శర్మ ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: Ind Vs Aus WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment