WI Vs IRE ODI Series: ఐర్లాండ్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌పై సంచలన విజయం నమోదు చేసింది. జమైకాలోని సబీనా పార్కులో జరిగిన మూడో వన్డేలో రెండు వికెట‍్ల తేడాతో గెలుపొందింది. విండీస్‌పై వరుసగా రెండు వన్డే మ్యాచ్‌లలో విజయం సాధించి... సిరీస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తమ తొలి సిరీస్ గెలుపు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్... ఆతిథ్య విండీస్‌ను 212 పరుగులకు ఆలౌట్ చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో షాయి హోప్ అర్ధ సెంచరీతో రాణించగా.. హోల్డర్ 44 పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా నామ మాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రిన్ 4 వికెట్లతో మరోసారి చెలరేగగా... క్రెగ్ యంగ్ మూడు వికెట్లతో రాణించాడు. కర్టిస్ కాంఫర్, డక్‌రెల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విలియం పోర్ట్‌ఫీల్డ్ డకౌట్ కాగా.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పట్టుదలగా నిలబడ్డాడు. 44 పరుగులతో రాణించాడు. ఇక రెండో వన్డేలో అద్భుతంగా ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ ఆండీ, హారీ హెక్టర్ మరోసారి అర్ధ శతకాలు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆండీ మెక్‌బ్రిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మూడో వన్డేలో విజయంతో ఐర్లాండ్ విండీస్‌పై సిరీస్ విజయం సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. జట్టులో కోవిడ్ కలకలం రేపినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి 2-1 తేడాతో గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంది.
మూడో వన్డే స్కోర్లు:
వెస్టిండీస్- 212 (44.4)
ఐర్లాండ్- 214/8 (44.5).
Shai Hope hits one of his classic innings to be our #MastercardPricelessMoment of the 3rd CG Insurance ODI. #WIvIRE pic.twitter.com/oSH5OvQgmO
— Windies Cricket (@windiescricket) January 16, 2022
Comments
Please login to add a commentAdd a comment