హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కేఎల్ రాహుల్(PC: BCCI)
ODI Vice Captain: KL Rahul Will Be Rohit Sharma Deputy Pant Name Also Reports: రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథిగా విరాట్ కోహ్లి శకం ముగిసినట్లయింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించడం, 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడం... ఆ తర్వాత వన్డే సారథిగా కూడా తానే ఎంపిక కాన్నుట్లు వార్తలు వచ్చాయి.
వీటిని నిజం చేస్తూ... బుధవారం బీసీసీఐ ప్రకటన చేసింది. అంతేగాక టెస్టు కెప్టెన్సీ వైస్ కెప్టెన్‌గా కూడా అతడిని ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో టీ20 వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సైతం వన్డేల్లో ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్‌కు డిప్యూటీగా అతడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే వైస్ కెప్టెన్ రేసులో రిషభ్ పంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. ఈ యువ ఆటగాడికి ఇప్పుడే ఆ బాధ్యతలు అప్పజెప్పడం తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘కేఎల్ రాహులే తర్వాతి వైస్ కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌కు డిప్యూటీగా వేరే ఛాయిస్ లేదు. కాబట్టి సుదీర్ఘకాలంగా వైట్ బాల్ క్రికెట్‌లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపడం సహజం. సమీప కాలంలో తను కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిత్, విరాట్, ద్రవిడ్ మార్గదర్శనంలో తను మరో స్థాయికి ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చారు.
ఇక రిషభ్ పంత్ గురించి చెబుతూ.. ‘‘రిషభ్ చాలా చిన్నవాడు. ఇప్పుడే తనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తే అధిక భారం పడుతుంది. సీనియర్ల నుంచి తను నేర్చుకోవాల్సి చాలా ఉంది. కెప్టెన్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించడం తనకు తలమించిన భారం అవుతుందని నా అభిప్రాయం’’ అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
కేఎల్ రాహులే ఎందుకు బెటర్ ఛాయిస్?
►ఇంగ్లండ్ పర్యటన తర్వాత రాహుల్ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు.
►ప్రస్తుతానికి వన్డేల్లో కేఎల్ రాహుల్ కంటే మంచి రికార్డు ఉన్న ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
►ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన రాహుల్... గత రెండేళ్లలో అంతర్జాతీయ వన్డేల్లో సాధించిన సగటు 61.92.
►న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్ వైస్ కెప్టెన్‌గా నియామకం
►సీనియర్లు కోహ్లి, రోహిత్, హెడ్‌కోచ్‌తో ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment