కరాచీ: ప్రపంచకప్‌లో భారత్–పాక్ మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం టికెట్ దక్కించుకోవడం మహామహులకే సాధ్యం కాదు. కానీ మహేంద్ర సింగ్ ధోని తన పాకిస్తాన్ అభిమాని కోసం 2011లో ఒక టికెట్ ఏర్పాటు చేశాడు! ఆ అదృష్టవంతుడి పేరు మొహమ్మద్ బషీర్. పాక్‌లోని కరాచీలో పుట్టి అమెరికాలో స్థిరపడిన 65 ఏళ్ల బషీర్‌ను అంతా ‘చాచా చికాగో’ అని పిలుస్తారు. హైదరాబాద్ మహిళను పెళ్లి చేసుకున్న ఆయనకు ధోనితో ప్రత్యేక అనుబంధం ఉంది. (చదవండి: ‘ధోనిని నేనే కాపాడాను’)
ఎప్పుడూ భారత్–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినా...తన ప్రత్యేక వేషధారణతో మ్యాచ్‌కు హాజరై అతను ధోనికి మద్దతు తెలిపేవాడు. సొంత దేశస్తులు ‘ద్రోహి’ అన్నా బషీర్ పట్టించుకోలేదు. ఇప్పుడు ధోని రిటైర్ కావడంతో ఇకపై భారత్–పాక్ మధ్య జరిగే ఎలాంటి మ్యాచ్ కూడా చూడనని అతను ప్రకటించాడు. ‘ధోని రిటైర్ అయ్యాడంటే నేను కూడా అయినట్లే. ఎక్కడెక్కడికో వెళ్లి అతని లేని మ్యాచ్‌లు చూడటం నాకిష్టం లేదు. ధోనితో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అతనంటే నాకెంతో ప్రేమ. ధోని కూడా నాపై అదే అభిమానం చూపించాడు. ఏ మైదానంలో కనిపించినా పలకరించడం, తన వైపుఏదో ఒక బహుమతి ఇవ్వడం అతను ఆపలేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు కాబట్టి నేను కూడా రిటైర్ అవుతున్నా’ అని బషీర్ వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి..
ధోని ఇంటికి చేరుకున్న రిటైర్మెంట్ గిఫ్ట్
వ్యాపారులకు ధోని పాఠాలివే..
హగ్ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చా : రైనా
Comments
Please login to add a commentAdd a comment