Photo Credit: Twitter
పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. అయితే అజమ్ ఖాన్ మరణ వార్తలో నిజం లేదన్న విషయం కాసేపటికే నిరూపితమైంది. ఎందుకంటే తన మరణవార్తపై అజమ్ ఖాన్ స్వయంగా లైవ్ వీడియోను రిలీజ్ చేశాడు. 'బతికుండగానే నన్ను చంపేశారుగా' అని తన స్నేహితులతో నవ్వుతూ పేర్కొన్న వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఆ తర్వాత తాను చనిపోయినట్లు వచ్చిన ఫేక్ వార్తకు సంబంధించిన వీడియోను అజమ్ ఖాన్ పంచుకున్నాడు. ఆ వీడియోలో ఒక మహిళా న్యూస్ యాంకర్ వార్తలు చదువుతూ..'యువ క్రికెటర్ అజమ్ ఖాన్ అకాల మరణం చెందాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి' అని పేర్కొనడం కనిపించింది.
దీనిపై అజమ్ ఖాన్ స్పందిస్తూ.. ‘నేను మరణించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. ఒక ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి నా చావు విషయం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు’ అంటూ చమత్కరించాడు. ఇక 28 ఏళ్ల అజమ్ ఖాన్ పాక్ తరఫున 14 టీ20లు ఆడాడు.
పాకిస్తాన్ తరఫున చివరిసారి 2024 టీ20 ప్రపంచకప్ ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026) తర్వాత అజమ్ ఖాన్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. పీఎస్ఎల్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 8 ఇన్నింగ్స్‌లు కలిపి 236 పరుగులు చేశాడు.
అయితే ఈ సీజన్‌లో అజమ్ ఖాన్ అత్యుత్తమ ప్రదర్శన రావల్పిండిపై వచ్చింది. ఆ మ్యాచ్‌లో అజమ్ ఖాన్ ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 34 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. ఇక 2021లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడిన అజమ్ ఖాన్ మూడేళ్ల కాలంలో 14 టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ 13 ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడుసార్లు డకౌటవ్వడం గమనార్హం.
Azam Khan reacting to fake news about him. 😅 pic.twitter.com/U97XVd05P8
— Salman. (@TsMeSalman1_) September 29, 2026
ఇదీ చదవండి: భారత్, పాక్ మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?


