క్రికెటర్లుగా మారి సంపన్నలుగా ఎదిగిన ఆటగాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ మొదలు.. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వందలాది కోట్ల రూపాయలు ఆర్జించి రిచెస్ట్ ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించారు.
ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ కూడా బాగానే ఆర్జించాడు. అయితే, అందరు క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉండదు. దురదృష్టం వెక్కిరిస్తే.. ఆకలికి అలమటించాల్సిన రోజులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఉత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదుగుతాడని భావించిన పాకిస్తాన్ క్రికెటర్ కథే ఇందుకు నిదర్శనం.
జింబాబ్వేతో మ్యాచ్‌తో అరంగేట్రం
1971, మార్చి 22న పెషావర్‌లో జన్మించాడు అర్షద్ ఖాన్. క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న అతడు.. 1993లో జింబాబ్వేతో వన్డే సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. 1997లో వెస్టిండీస్‌తో మ్యాచ్ నేపథ్యంలో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు.
1993- 2006 వరకు అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా 9 టెస్టులు, 58 వన్డేలు ఆడిన ఈ రైట్‌ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ వరుసగా 32, 56 వికెట్లు పడగొట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించిన అర్షద్ ఖాన్.. టీమిండియాతో మ్యాచ్‌లలోనూ సత్తా చాటాడు.
అర్షద్ ఖాన్(PC: PCB)
సచిన్, సెహ్వాగ్ వికెట్లు తీసిన ఘనత
భారత్‌లో పర్యటించిన జట్టులో భాగమైన అతడు.. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సహా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ తదితరులను అవుట్ చేశాడు. ఇక చివరిసారిగా 2005లో టీమిండియాతో అర్షద్ ఖాన్ తన ఆఖరి వన్డే ఆడాడు.
ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్‌గా
అయితే, ఇండియన్ క్రికెట్ లీగ్ బరిలో దిగిన తర్వాత అర్షద్ ఖాన్.. కెరీర్ చరమాంకానికి చేరుకుంది. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. అప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన అర్షద్ ఖాన్.. పాకిస్తాన్‌లో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాకి వలస వెళ్లాడు.
సిడ్నీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో 2020లో ఓ క్రికెట్ ఫ్యాన్ సిడ్నీలో అర్షద్‌ను గుర్తుపట్టడంతో అతడి ఆర్థిక స్థితి గురించి ప్రపంచానికి తెలిసింది.
పీసీబీ సాయంతో మళ్లీ క్రికెట్‌తో అనుబంధం
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అర్షద్ ఖాన్‌కు సాయం చేయాలని నిర్ణయించుకుంది. తన బౌలింగ్ నైపుణ్యాలతో జట్టు విజయాల్లో భాగమైన అతడికి మహిళా క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అవకాశం కల్పించింది. అలా.. మళ్లీ 52 ఏళ్ల అర్షద్ పాకిస్తాన్‌కు చేరుకోగలిగాడు. ఆసియా కప్-2023 నేపథ్యంలో సెప్టెంబరు 2న దాయాదులు భారత్- పాకిస్తాన్ తలపడనున్న తరుణంలో అర్షద్ ఖాన్ గతానికి సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment