Arshad Khan
-
సచిన్ వికెట్ తీసిన పాక్ బౌలర్! ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాలో డ్రైవర్‌గా.. ఆ తర్వాత
క్రికెటర్లుగా మారి సంపన్నలుగా ఎదిగిన ఆటగాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ మొదలు.. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వందలాది కోట్ల రూపాయలు ఆర్జించి రిచెస్ట్ ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించారు. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ కూడా బాగానే ఆర్జించాడు. అయితే, అందరు క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉండదు. దురదృష్టం వెక్కిరిస్తే.. ఆకలికి అలమటించాల్సిన రోజులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఉత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదుగుతాడని భావించిన పాకిస్తాన్ క్రికెటర్ కథే ఇందుకు నిదర్శనం. జింబాబ్వేతో మ్యాచ్‌తో అరంగేట్రం 1971, మార్చి 22న పెషావర్‌లో జన్మించాడు అర్షద్ ఖాన్. క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న అతడు.. 1993లో జింబాబ్వేతో వన్డే సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. 1997లో వెస్టిండీస్‌తో మ్యాచ్ నేపథ్యంలో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. 1993- 2006 వరకు అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 9 టెస్టులు, 58 వన్డేలు ఆడిన ఈ రైట్ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ వరుసగా 32, 56 వికెట్లు పడగొట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించిన అర్షద్ ఖాన్.. టీమిండియాతో మ్యాచ్‌లలోనూ సత్తా చాటాడు. అర్షద్ ఖాన్(PC: PCB) సచిన్, సెహ్వాగ్ వికెట్లు తీసిన ఘనత భారత్‌లో పర్యటించిన జట్టులో భాగమైన అతడు.. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సహా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ తదితరులను అవుట్ చేశాడు. ఇక చివరిసారిగా 2005లో టీమిండియాతో అర్షద్ ఖాన్ తన ఆఖరి వన్డే ఆడాడు. ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్‌గా అయితే, ఇండియన్ క్రికెట్ లీగ్ బరిలో దిగిన తర్వాత అర్షద్ ఖాన్.. కెరీర్ చరమాంకానికి చేరుకుంది. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. అప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన అర్షద్ ఖాన్.. పాకిస్తాన్లో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాకి వలస వెళ్లాడు. సిడ్నీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో 2020లో ఓ క్రికెట్ ఫ్యాన్ సిడ్నీలో అర్షద్‌ను గుర్తుపట్టడంతో అతడి ఆర్థిక స్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. పీసీబీ సాయంతో మళ్లీ క్రికెట్‌తో అనుబంధం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అర్షద్ ఖాన్‌కు సాయం చేయాలని నిర్ణయించుకుంది. తన బౌలింగ్ నైపుణ్యాలతో జట్టు విజయాల్లో భాగమైన అతడికి మహిళా క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అవకాశం కల్పించింది. అలా.. మళ్లీ 52 ఏళ్ల అర్షద్ పాకిస్తాన్‌కు చేరుకోగలిగాడు. ఆసియా కప్-2023 నేపథ్యంలో సెప్టెంబరు 2న దాయాదులు భారత్- పాకిస్తాన్ తలపడనున్న తరుణంలో అర్షద్ ఖాన్ గతానికి సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం -
మధ్యప్రదేశ్ ఆటగాడికి బంపరాఫర్.. ఏకంగా ముంబై జట్టులో..!
ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అర్షద్ ఖాన్ గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్షద్ ఖాన్‌ను రూ. 20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అర్షద్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కుమార్ కార్తికేయను రూ. 20 లక్షలకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్తికేయ తన డొమాస్టిక్ కెరీర్లో ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్లో 35 వికెట్లు, లిస్ట్-ఎ కెరీర్లో 18 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు. అయితే ముంబై స్పిన్నర్ హృతిక్ షోకీన్ రాణిస్తుండటంతో.. కార్తికేయకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. చదవండి: IND vs SA T20 Series: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రికెటర్లకేంటీ దుస్థితి.. ఒకరేమో కార్పెంటర్‌గా మరొకరేమో క్యాబ్ డ్రైవర్‌గా
న్యూఢిల్లీ: క్రీడల చరిత్రలో ఫుట్‌బాల్ తర్వాత అత్యధికంగా కాసుల కురిపించే ఆటగా చలామణి అవుతున్న క్రికెట్లో కొందరు మాజీలు ఆర్ధిక కష్టాల కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేవియర్ డోహర్టీ కార్పెంటర్‌గా పని చేసుకుంటున్న విషయం వెలుగు చూడగా, తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ స్థితి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. 2015 వన్డే ప్రపంచ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న డోహర్టీ ఆర్థిక కష్టాల కారణంగా కార్పెంటర్ అవతారమెత్తాడు. లెఫ్టార్మ్ స్పిన్నరయిన డోహర్టీ.. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. 2001-02 సీజన్లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆయన.. 17 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగాడు. అతను చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇక ఆర్ధిక ఇబ్బందులు తాలలేక క్యాబ్ డ్రైవర్‌గా మారిన అర్షద్ ఖాన్‌ది కూడా అంతర్జాతీయ క్రికెట్లో భారీ నేపథ్యమే. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. భారత్ 2005 పాక్ పర్యటనలో అదరగొట్టిన అర్షద్.. దిగ్గజ ఆటగాళ్లైన సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీసి, అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అయితే, రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులు ఎదురవ్వడంతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. కుటుంబాన్ని పోషించేందుకు సిడ్నీలో నానా తంటాలు పడుతున్నాడు. ఇక అర్షద్ తన చివరి టెస్ట్, వన్డేను భారత్‌లోనే ఆడాడు. మొత్తంగా ఆర్ధిక కష్టాల కారణంగా దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్న అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. శ్రీలంక ఆటగాడు సూరజ్ రణ్దీవ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు మాథ్యూ సింక్లెయిర్, క్రిస్ కెయిన్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆడమ్ హోలియోక్, ఆసీస్ స్పీడ్ స్టార్ క్రెయిగ్ మెక్ డెర్మాట్.. ఇలా ప్రస్తుత, పాత తరానికి చెందిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. చదవండి: టీమిండియానే ప్రపంచ ఛాంపియన్.. ఆసీస్ కెప్టెన్ జోస్యం -
తెరపైకి మరో సోషల్ మీడియా ’అణుబాంబ్’!?
పాకిస్థానీ నీలికళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఓ మూలన టీ అమ్ముకునే అర్షద్ ఖాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో ఒక్కసారిగా అతని దశ తిరిగిపోయింది. అమ్మాయిలు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. దాంతో నిన్నమొన్నటి వరకు చాయ్ అమ్ముకున్న ఈ 18 ఏళ్ల కుర్రాడిని ఏకంగా మోడలింగ్ చాన్స్ వరించింది. ప్రముఖ దుస్తుల కంపెనీకి మోడలింగ్ బ్రాండ్‌గా నియమించుకుంది. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అర్షద్ ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టగా.. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను భారీగా షేర్ చేసుకున్నారు. పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల ’అణుబాంబ్’ భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. అచ్చం నీలికళ్ల అర్షద్ రీతిలోనే సింగపూర్‌కు చెందిన ‘అణుబాంబ్’ తెరపైకి వచ్చాడు. పేరు లీ మిన్వీ. వయస్సు 22 ఏళ్లు. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్పోర్ట్ భద్రత వ్యవహారాలను చూసే సెర్టిస్ సిస్కో సంస్థలో సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. విమానాశ్రయ భద్రతాధికారిగా పనిచేస్తున్న అతని గుణగణాలను వివరిస్తూ తాజాగా చాంగీ ఎయిర్పోర్ట్ తన ఫేస్బుక్ పేజీలో అతని ఫొటో పెట్టింది. వెంటనే అతని ఫొటో వైరల్‌గా మారిపోయింది. వందలాది మంది అమ్మాయిలు అతని ఫొటోను షేర్ చేసుకుంటూ... అతని ముగ్ధమోహన అందాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. సహజంగానే సింగపూర్ పర్యాటక ప్రాంతం. కానీ సింగపూర్‌నే కాదు.. ఈ చూడచక్కని కుర్రాడ్ని చూసేందుకు కూడా తాము సింగపూర్‌కు వస్తామని పలువురు అమ్మాయిలు కామెంట్ పెడుతున్నారు. సోషల్ మీడియాతోపాటు అమ్మాయిల హృదయాలను కూడా మిన్వీ తన రామసక్కనిరూపుతో వెలిగించాడని ఓ అమ్మాయి వ్యాఖ్యానించగా.. అమ్మాయిల కోసం చాంగీ ఎయిర్‌పోర్ట్‌లోని అతను ఏ టెర్మినల్‌లో పనిచేస్తాడు? ఏ షిఫ్ట్‌లో ఉంటాడో తెలియజేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
'అణుబాంబ్'ను వరించిన భలే అదృష్టం!
-
'అణుబాంబ్'ను వరించిన భలే అదృష్టం!
మొన్నటివరకు అతను ఇస్లామాబాద్‌లో ఓ మామూలు చాయ్‌వాలా! నిన్నటికినిన్న భారత్‌పై పాకిస్థాన్ 'అణుబాంబ్' ఇతడే అంటూ ట్విట్టర్లో హల్చల్ చేశాడు. ఈ రోజు ఏకంగా భారీ మోడలింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. నీలికళ్ల 'చాయ్‌వాలా' అర్షద్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాకు వేవేల ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. రెండుమూడు రోజుల కిందటి వరకు ఇస్లామాబాద్‌లోని ఇత్వార్ బజార్లో చాయ్ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్ ఖాన్ అదృష్టం రెండురోజుల్లోనే అనూహ్యంగా మారిపోయింది. తన ప్రమేయం లేకుండానే అతడు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యాడు. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అతని ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టగా.. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో చాయ్‌వాలా (#ChaiWala) హ్యాష్‌ట్యాగ్ పాకిస్థాన్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్ స్థానంలో నిలిచింది. అలా అర్షద్ ఖాన్ దశ తిరిగిపోయి.. ఫిటిఇన్.పీకే ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్‌కు మోడలింగ్ చేసే అవకాశం అతన్ని వరించింది. చాయ్‌వాలా ఇప్పుడు తన కెరీర్‌ను మార్చుకొని.. ఫ్యాషన్వాలాగా మారిపోయాడని ఫిటిఇన్.పీకే సంస్థ తన ఫేస్బుక్ పేజీలో తెలిపింది. కోటు, సూటు ధరించిన అతని ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఇక, 17మంది తోబుట్టవుల్లో ఒకరైన అర్షద్ తాను ఇంతగా ఫేమస్ కావడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఇప్పటివరకు 35 నుంచి 50 మంది మహిళలతో తనతో సెల్ఫీలు, వీడియోలు తీసుకొని వెళ్లారని, తాను ఇంతగా పాపులర్ కావడం ఆనందం కలిగిస్తున్నదని 18 ఏళ్ల అర్షద్ తెలిపాడు. మోడలింగ్ ఓకే చెప్పిన అతను భవిష్యత్తులో సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని చెప్తున్నాడు. -
క్యాబ్ డ్రైవర్‌గా మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే చాలు కోటీశ్వరుడు అయిపోవచ్చు. జీతాలే గాక వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ వంటి అవకాశాల ద్వారా బోలెడు డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇదంతా పార్శ్యంలో ఓ కోణం మాత్రమే. ప్రపంచంలో పేదరికం అనుభవిస్తున్న మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇందుకు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ అర్షద్ ఖాన్ మరో ఉదాహరణ. అర్షద్ సిడ్నీలో ఉబెర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్థాన్ తరపున అర్షద్ 9 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 32, వన్డేల్లో 56 వికెట్లు తీశాడు. 1997-98 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అర్షద్ 2001 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో భారత దిగ్గజాలు సచిన్, ద్రావిడ్‌ల వికెట్లను తీశాడు. భారత్‌లో నిషేధిత ఇండియన్ క్రికెట్ లీగ్‌లో కూడా ఆడాడు. ఇంతటి కెరీర్ ఉన్నా అర్షద్ నేడు ఉపాధి కోసం టాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ఊహించని విషయం. అర్షద్ ఉదంతాన్ని ఓ భారతీయ నెటిజెన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 'సిడ్నీకి వెళ్లినపుడు అర్షద్ కలిశాడు. తొలుత నేను అతణ్నిగుర్తించలేదు. పాకిస్తానీగా పరిచయం చేసుకున్నాడు. కొంతకాలంగా సిడ్నీలో నివసిస్తున్నానని చెప్పాడు. అతని పూర్తి పేరు అడిగాను. ఆ తర్వాత అతని ముఖం చూసి షాకయ్యాను. అతను పాకిస్థాన్ క్రికెటరని గుర్తించాను. అతని క్యాబ్‌లో ప్రయాణించినపుడు నీళ్లు, ఆహారపదార్థాలు ఇచ్చాడు. హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు' అని నెటిజన్ వెల్లడించాడు.