
Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అర్షద్ ఖాన్ గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. ఐపీఎల్-2022 మెగా వేలంలో అర్షద్ ఖాన్‌ను రూ. 20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అర్షద్ గాయపడ్డాడు.
దీంతో అతడి స్థానంలో కుమార్ కార్తికేయను రూ. 20 లక్షలకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్తికేయ తన డొమాస్టిక్ కెరీర్‌లో ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 35 వికెట్లు, లిస్ట్-ఎ కెరీర్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు. అయితే ముంబై స్పిన్నర్ హృతిక్ షోకీన్ రాణిస్తుండటంతో.. కార్తికేయకి తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి.
చదవండి: IND vs SA T20 Series: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?!