ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సుమిత్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "నీ ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చావు. ఈ విజయంతో భారతదేశ యువత నీ నుంచి అద్భుతమైన స్ఫూర్తిని పొందుతారు. సుమీత్ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది. సుమిత్ ఇలాగే భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి అని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమిత్ అంటిల్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
జావెలిన్ త్రో ఈవెంట్‌లో తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్... తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి, సరికొత్త చరిత్ర సృష్టించాడు.
చదవండి: Sumit Antil: సుమిత్ అంటిల్‌కు సీఎం జగన్ అభినందనలు
That special moment
— Anurag Thakur (@ianuragthakur) August 30, 2021
when India’s 🇮🇳 Prime Minister
calls to congratulate you…
Just after you’ve won the #Paralympics
GOLD🥇 and broken the world record…
Well Done Sumit Antil !#Praise4Para #Cheer4India
| @narendramodi @Media_SAI @PIB_India | pic.twitter.com/pZapR2bbAm
Comments
Please login to add a commentAdd a comment