ఐపీఎల్ క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. భారీ లక్ష్యం ముందుంటే 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ విజయానికి దూరమైంది. 18 బంతుల్లో 53 పరుగుల సమీకరణం అసాధ్యమనిపించింది. కానీ హిట్టర్ హెట్‌మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు)... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో గెలుపు ఆశలు చిగురించాయి. ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 16 పరుగుల్ని పంజాబ్ సీమర్ సామ్ కరన్ తెలివైన బౌలింగ్‌తో అడ్డుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 5 పరుగులతో గట్టెక్కింది.
గువాహటి: పంజాబ్ కింగ్స్ భారీ స్కోరుతో మరో విజయం సాధించింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన పోరులో శిఖర్ ధావన్ బృందం 5 పరుగులతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది.
ధావన్ (56 బంతుల్లో 86 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారీలక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేయగలిగింది. సామ్సన్ ( 25 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాథన్ ఎలిస్ 4 వికెట్లు తీశాడు.
శుభారంభం...
తొలి ఓవర్లోనే బౌండరీతో తన ఉద్దేశాన్ని చాటిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ క్రీజులో ఉన్నంత సేపూ అదే జోరు కొనసాగించాడు. ఆసిఫ్ వేసిన నాలుగో ఓవర్లో 3 ఫోర్లు, మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అనుభవజు్ఞడైన అశ్విన్‌ను దించినా... బౌండరీలతో తన ఎదురుదాడి కొనసాగించాడు. పవర్ ప్లేలో పంజాబ్ 63/0 స్కోరు చేసింది. కాసేపటికే ప్రభ్‌సిమ్రాన్ 28 బంతుల్లో అర్ధసెంచరీ (7 ఫోర్లు, 2 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు.
ఓపెనింగ్ భాగస్వామ్యానికి ఎట్టకేలకు పదో ఓవర్లో బ్రేక్ పడింది. ప్రభ్‌సిమ్రాన్‌ను హోల్డర్ అవుట్ చేయడంతో 90 పరుగుల వద్ద తొలి వికెట్ కూలింది. ధావన్ పవర్‌ఫుల్ షాట్ రాజపక్స కుడి మోచేతికి బలంగా తగలడంతో రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. తర్వాత జితేశ్ శర్మ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్)అండతో ధావన్ రెచ్చిపోయాడు.
వణికించిన హెట్‌మైర్, ధ్రువ్
ఆరంభంలోనే ఓపెనర్లు అశ్విన్ (0), యశస్వి జైస్వాల్ (11)లను... పవర్‌ప్లేలోనే బట్లర్ (11 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లాంటి హిట్టర్ వికెట్లను కోల్పోయిన రాజస్తాన్‌కు కొండంత లక్ష్యం ఛే దించడం అసాధ్యమైంది. చివర్లో హెట్‌మైర్, ధ్రువ్ ఏడో వికెట్‌కు చకచకా జోడించిన 62 పరుగుల భాగస్వామ్యం పంజాబ్ శిబిరాన్ని వణికించింది. రాజస్తాన్‌ను గెలుపు వైపునకు తీసుకెళ్లింది. కానీ ఆఖరి ఓవర్ వేసిన కరన్ కింగ్స్‌ను గెలిపించాడు.
స్కోరు వివరాలు:
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 60; ధావన్ (నాటౌట్) 86; రాజపక్స (రిటైర్డ్‌హర్ట్) 1; జితేశ్ శర్మ (సి) పరాగ్ (బి) చహల్ 27; సికందర్ (బి) అశ్విన్ 1; షారుఖ్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 11; సామ్ కరన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–90, 2–158, 3–159, 4–196. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–0, ఆసిఫ్ 4–0–54–0, అశ్విన్ 4– 0– 25–1, హోల్డర్ 4–0–29–2, చహల్ 4– 0–50–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) సబ్–షార్ట్ (బి) అర్‡్షదీప్ 11; అశ్విన్ (సి) ధావన్ (బి) అర్‡్షదీప్ 0; బట్లర్ (సి అండ్ బి) ఎలిస్ 19; సామ్సన్ (సి) సబ్–షార్ట్ (బి) ఎలిస్ 42; పడిక్కల్ (బి) ఎలిస్ 21; పరాగ్ (సి) షారుఖ్ (బి) ఎలిస్ 20; హెట్‌మైర్ (రనౌట్) 36; ధ్రువ్ (నాటౌట్) 32; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–13, 2–26, 3–57, 4–91, 5–121, 6–124, 7–186. బౌలింగ్: కరన్ 4–0–44–0, అర్‡్షదీప్ 4–0–47–2, హర్‌ప్రీత్ 2–0–15–0, ఎలిస్ 4–0–30–4, చహర్ 4–0–31–0, సికందర్ 2–0–24–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా Vs బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment