R Ashwin Shocking Comments On Bazball Brand Cricket, Says Players Need To Be Careful - Sakshi
Sakshi News home page

Ind Vs Eng: బ్యాజ్‌బాల్‌పై అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Jul 14 2022 9:56 PM | Last Updated on Fri, Jul 15 2022 9:25 AM

R Ashwin On Why Players Need To Be Careful About Bazball Brand Cricket - Sakshi

ఇంగ్లండ్ క్రికెట్ లో పెను సంచలనం రేపుతున్న బ్యాజ్ బాల్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాజ్ బాల్ అంటే.. టెస్టులను కూడా బోర్ కొట్టించకుండా ఆడటమే. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే  ప్రత్యర్థి మీద ఆధిపత్యం చెలాయించడం. తాజాగా టీమిండియా వెటరన్ ఆఫ్  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  ఇదే విషయమై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘చూడటానికి ఇది బాగానే ఉంది. కానీ ఒక బౌలర్  గా ఆట ఎక్కడికి పోతుందో అనే ఆందోళన కలుగుతున్నది. నాకు తెలిసి ఇంగ్లాండ్ లో పిచ్ లు, బాల్ కూడా  ఇంగ్లాండ్ ఈ తరహా క్రికెట్ ఆడేందుకు దోహదపడుతున్నాయని అనిపిస్తుంది. ఈ విధానం (బ్యాజ్ బాల్) పై మనం జాగ్రత్తగా ఉండాలి. టెస్టు క్రికెట్ అనేది  గడిచిన వంద సంవత్సరాలుగా దాని సొగసును కోల్పోకుండా అలాగే నిలిచింది. అయితే ఈ తరహా క్రికెట్ ఆడితే అది ఎంతకాలం మనగలుగుతుందానేది చర్చనీయాంశం.’ అని కామెంట్ చేశాడు.

బ్యాజ్ బాల్ విధానం ద్వారా కివీస్ తో సిరీస్ ను గెలిచి ఇండియా తో సిరీస్ సమం చేసిన ఆ జట్టు సారథి  బెన్ స్టోక్స్ మాత్రం.. జట్టు ఏదైనా తాము ఆడే విధానం మాత్రం మారబోదని.. దూకుడే తమ మంత్రమని చెప్పిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement