
అహ్మదాబాద్: టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్‌ల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. స్వయంగా బుమ్రానే తన పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో వీరి వివాహంపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా సోమవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కూడా ఉంది. అయితే రాజస్తాన్ రాయల్స్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. బుమ్రాకు కంగ్రాట్స్ చెబుతూనే హనీమూన్‌కు ఎక్కడికి వెళితే బాగుంటుందో చిన్న హింట్ ఇచ్చింది.
''కంగ్రాట్స్.. బుమ్రా, సంజన గణేషన్. రానున్న ఏప్రిల్ , మే నెలల్లో మాల్దీవ్స్ మీ హనీమూన్‌కు చక్కగా సరిపోతుందని మేము విన్నాము.. ఇంకేంటి మరి హ్యాపీ జర్నీ'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. అదే ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ 14వ సీజన్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బుమ్రా ఐపీఎల్ ఆడకుండా హనీమూన్ ఎంజాయ్ చేయాలంటూ ఆర్‌ఆర్ ఈ ఫన్నీ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తుంది.
రాజస్తాన్ రాయల్స్ పెట్టిన ట్వీట్‌పై నెటిజన్లు తమదైశ శైలిలో ట్రోల్ చేస్తున్నారు. హనీమూన్‌కు వెళ్లాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయించుకుంటారు.. మధ్యలో మీ సలహా ఏంటి.. ఐపీఎల్ తర్వాతే బుమ్రా హనీమూన్ ప్లాన్ చేసుకుంటాడు... పెళ్లి అయిపోయంది.. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.కాగా ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న మొదలై.. మే 30న ముగియనుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి:
అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి
బుమ్రా 'ప్యా'ర్కర్‌కు సంజన క్లీన్ బౌల్డ్..
Congratulations, guys! 🎉
— Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2021
We hear Maldives is great in April - May 😬 https://t.co/K3cBgz6cBS
Comments
Please login to add a commentAdd a comment